Hyundai Cars: కారు మార్కెట్‌పై ఆధిపత్యానికి హ్యుండయ్ ప్రయత్నం, మరో రెండు కార్లు లాంచ్‌కు సిద్ధం
Hyundai Cars: భారత దేశ కారు మార్కెట్‌లో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రాతో పాటు హ్యుండయ్ మోటార్స్‌కు పట్టు ఎక్కువ. హ్యుండయ్ కార్లంటే క్రేజ్ అంతా ఇంతా కాదు. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ అయినా, ఎస్‌యూవీ అయినా హ్యుండయ్ కార్లకు డిమాండ్ ఎక్కువే.
Hyundai Cars: దక్షిణ కొరియాకు చెందిన హ్యుండయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్‌లో చాలా కార్లు లాంచ్ చేసింది. ఇప్పుడు త్వరలో మరి కొన్ని కార్లు లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మరో రెండు కార్లను ప్రవేశపెట్టనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హ్యుండయ్ కంపెనీకు చెందిన అల్‌కజార్, క్రెటా, కోనా ఎలక్ట్రిక్ వాహనాల అప్‌డేటెడ్ వెర్షన్స్ త్వరలో లాంచ్ చేసేందుకు హ్యుండయ్ సిద్ధమౌతోంది. ఈ కార్లను 2024లో లాంచ్ చేయనున్నట్టు సమాచారం. దీంతోపాటు 2025లో హ్యుండయ్ వెన్యూ న్యూ జనరేషన్ ఎస్‌యూవీ సైతం లాంచ్ చేయనుంది. 2024లో ఇండియన్ మార్కెట్‌లో కోనా, ఎక్స్‌టర్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది. హ్యుండయ్ ఎక్స్‌టర్ కచ్చితంగా ఎప్పుడు లాంచ్ అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ హ్యుండయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్, హ్యుండయ్ వెర్నా ఎన్ లైన్ మోడల్స్ గ్రాండ్ లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది.
హ్యుండయ్ వెర్నా ఎన్ లైన్ ప్రత్యేకతలు
హ్యుండయ్ వెర్నాకు భారతీయ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అత్యంత ప్రాచుర్యం పొందిన మోడల్ ఇది. ఈ కారు అప్‌డేటెడ్ వెర్షన్ హ్యుండయ్ వెర్నా ఎన్ లైన్ 2024లో రానుంది. ఇది స్పోర్ట్ వెర్షన్‌గా ఉండవచ్చు. ఇందులో మరింత శక్తివంతమైన ఇంజన్, స్పోర్ట్ సస్పెన్షన్, ఆకర్షణీయమైన డిజైన్ ఉంటాయి. ఈ కారు మోడల్ ఎలా ఉంటుందనేది ఇప్పటికే ట్రయల్ టెస్ట్ సందర్భంగా బయటికొచ్చింది. రెగ్యులర్ వెర్నాకు టాప్ ఎండ్ ట్రీమ్ మోడల్‌గా ఉంటుందని అంచనా. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు 160 బీహెచ్‌పి పవర్, 253 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ధ్యం ఉంటుంది.
హ్యుండయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ప్రత్యేకతలు
దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న ఎస్‌యూవీల్లో ఒకటి హ్యుండయ్ క్రెటా. అత్యంత ప్రాచుర్యం పొందిన మోడల్ ఇది. ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2024లో అందుబాటులో వస్తుందని అంచనా. ఇందులో అప్‌డేటెడ్ ఫీచర్లు, కొత్త డిజైన్, మల్టీ ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. మరో మూడు నెలల్లో ఇది లాంచ్ కానుంది. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. అంతేకాకుండా 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 160 బీహెచ్‌పీ పవర్ కలిగి ఉంటుంది. 1.5 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అయితే 115 బీహెచ్‌పి పవర్‌తో ఉంటుంది. ఇక 1.5 లీటర్ డీజిల్ యూనిట్ అయితే 115 బీహెచ్‌పి పవర్ జనరేట్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
Also read: Post Office Schemes: ఈ పోస్టాఫీస్ స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో ఆదాయం.. ఓ లుక్కేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook