Hyundai SUV Sales: హ్యుండయ్ కంపెనీ క్రెటానే కాదు వెన్యూ కూడా టాప్ సెల్లర్, ధర ఎంతంటే
Hyundai SUV Sales: దేశంలోని కార్ల తయారీ కంపెనీల్లో రెండవ స్థానంలో ఉన్న హ్యుండయ్ ఇటీవలి కాలంలో క్రేజ్ పెంచుకుంటోంది. ముఖ్యంగా సెడాన్, ఎస్‌యూవీ విభాగంలో హ్యుండయ్ సరికొత్త మోడళ్లలో ఆకర్షిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Hyundai SUV Sales: ఎస్‌యూవీ, సెడాన్ విభాగంలో హ్యుండయ్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. అద్భుతమైన అడ్వాన్స్డ్ ఫీచర్లు అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది హ్యుండయ్ కంపెనీ. హ్యుడయ్ క్రెటా ఒక్కటి చాలు ఈ కంపెనీ కార్లకు ఉన్న డిమాండ్ తెలియాలంటే. ఇప్పుడు క్రెటాతో పాటు మరో కూడా మార్కెట్‌లో దూసుకుపోతోంది. ధర కూడా చాలా తక్కువ.
హ్యుండయ్ మోటార్స్ ఇండియా దేశంలో మారుతి సుజుకి తరువాతి స్థానాన్ని ఆక్రమించింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కారు కంపెనీ గత నెల విక్రయాల నివేదిక వెలువరించింది. ఎప్పటిలానే ఈ నెల కూడా అత్యధికంగా విక్రయమైన కారుగా హ్యుండయ్ క్రెటా నిలిచింది. హ్యుండయ్ కార్లలో క్రెటా కారు క్రేజ్ సాధారణమైంది కాదు. అయితే ఇప్పుడు హ్యుండయ్ కంపెనీ కార్లలో క్రెటాతో పాటు మరో ఎస్‌యూవీ కూడా కస్టమర్లకు బాగా ఆకట్టుకుంటోంది. జూన్ నెలలో హ్యుండయ్ కంపెనీ కార్ల విక్రయాలు 50 వేలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 2.04 శాతం అధికం.య గత ఏడాది ఇదే నెలలో జూన్ నెలలో 49,001 యూనిట్లు విక్రయం కాగా ఈసారి 50,001 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈసారి కూడా హ్యుండయ్ క్రెటా అత్యధిక విక్రయాలు నమోదు చేసింది. టాటా నెక్సాన్, మారుతి బ్రెజా కార్లు హ్యుండయ్ క్రెటా కంటే తక్కువ విక్రయం కావడం గమనార్హం. అదే సమయంలో క్రెటాతో పాటు హ్యుండయ్‌కు చెందిన మరో ఎస్‌యూవీ భారీస్థాయిలో విక్రయమైంది.
గత ఏడాది జూన్ నెలలో హ్యండయ్ క్రెటా 13,790 యూనిట్లు విక్రయాలు నమోదు చేస్తే ఈ ఏడాది జూన్ లో 14,447 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. అంటే ఏడాదిలో 5 శాతం విక్రయాలు పెరిగాయి. అదే సమయంలో హ్యుండయ్ కంపెనీకు చెందిన కార్లలో అత్యథికంగా విక్రయమైన మరో కారు హ్యుండయ్ వెన్యూ. 11,606 యూనిట్లు అమ్ముడైంది. హ్యుండయ్ వెన్యూ అయితే గత ఏడాదితో పోలిస్తే 12 శాతం పెరిగింది. టాటా పంచ్, మారుతి బ్రెజాల కంటే హ్యుండయ్ వెన్యూనే ఎక్కువ అమ్మకాలు సాదించడం విశేషం.
హ్యుండయ్ వెన్యూ ధర 7.72 లక్షల రూపాయల్నించి ప్రారంభమౌతుంది. 13.18 లక్షల వరకూ ఉంటుంది. హ్యుండయ్ వెన్యూవి మొత్తం 5 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. హ్యుండయ్ వెన్యూ E,S,S Plus,S(O),SX,SX(O)వేరియంట్లలో మూడు ఇంజన్ల ఆప్షన్లను కలిగి ఉంది. మొదటిది 1.2 లీటర్ పెట్రోల్ వెర్షన్ 83 పీఎస్ పవర్, 114 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్‌తో పాటు అనుసంధానితమైంది. ఇక రెండవది 1 లీటర్ టర్బో పెట్రోల్ 120 పీఎస్ పవర్ 172 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇక మూడవది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 116 పీఎస్ పవర్, 250 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది.
ఇక అన్నింటికంటే ముఖ్యమైంది హ్యుండయ్ వెన్యూ ఫీచర్లు. ఇందులో కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు 8 ఇంచెస్ టచ్ స్క్రీన్, ఎయిర్ ప్యూరిఫయర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోబాక్్స, పుష్ బటన్ స్టార్ట్, స్టాప్ ఉంటాయి. దీంతోపాటు ఆటోమేటిక్ డ్రైవింగ్ సీట్, సింగిల్ ప్యాన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీ విత్ ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, రేర్ వ్యూ కెమేరా, రేర్ పార్కింగ్ సెన్సార్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉన్నాయి.
Also read: Tata Nexon: మీకిష్టమైన టాటా నెక్సాన్‌ను కేవలం 90 వేలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లడం ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook