Ideas with low investment, Profitable Business Ideas to start in 2022 With low Investment : రెండేళ్లుగా కోవిడ్‌తో దేశంలో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కోవిడ్ (Covid) వల్ల కొందరు ఉపాధి కోల్పొయారు. బతుకుదెరువు కోసం నగరాలకు వెళ్లిన వారంతా ఇళ్లకు చేరుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని చిన్నపాటి వ్యాపారాలు (Small businesses) లాభసాటిగా మారాయి. ఇలాంటి చిన్న బిజినెస్‌లను తక్కువ పెట్టుబడితో ఎవరైనా ప్రారంభించవచ్చు. ఆదాయం (Income) కూడా మంచిగానే ఉంటుంది. మరి 2022లో పరిస్థితులు బాగుంటే ఈ చిన్నపాటి వ్యాపారాల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎరువులు, విత్తనాల షాప్
ఎరువులు, విత్తనాలు అమ్మే షాప్‌లకు (Fertilizer, Seed Shop) ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లి ఎరువులు, (Fertilizer) విత్తనాలు (Seeds) తెచ్చుకోవాలంటే రైతులకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల గ్రామాల్లో, మండల కేంద్రాల్లో ఎరువులు, విత్తనాల షాప్‌ ప్లాన్ చేస్తే బాగుంటుంది. 


పెట్టుబడిని బట్టి పట్టణాలలో కూడా ఈ షాప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మంచి బిజినెస్. ప్రభుత్వం (Government) నుంచి రైతులకు అందే సబ్సిడీలను (Subsidy) వారికే ఇస్తే మీపై నమ్మకం పెరుగుతుంది. ఎక్కువ మంది రైతులు మీ షాప్‌నకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ బిజినెస్‌ తక్కువ బడ్జెట్‌లోనే ప్రారంభించవచ్చు.


నగరాల్లో అమ్మకాలు..


మీ గ్రామంలో పొలాల్లో ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను... నగరాల్లో నేరుగా ఇంటింటికీ వెళ్లి అమ్మితే మంచి లాభం వస్తుంది. హోమ్ డెలివరీ (Home delivery) టైప్‌లో ఈ బిజినెస్‌ చేయవచ్చు. కూరగాయలు, పాల పదార్ధాలను ఇలా అమ్మవచ్చు. నగరవాసులు కూడా మంచి ఆహార పదార్థాలకు, నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి ఇలా అమ్మకాలు చేపట్టడం వల్ల లాభాలు చూడొచ్చు. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు నుంచి పలు కూరగాయలను, అలాగే పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటికి కూడా అమ్మవచ్చు.


సేందియ ఉత్పత్తులు (Organic products)


ప్రస్తుతం చాలా మంది సేంద్రియ పద్ధతిలో (Organic method) పండించిన వాటినే తినడానికి ఇష్టపడుతున్నారు. వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. సేంద్రియ కూరగాయలు, పండ్లు తినడానికే పట్టణవాసులు మక్కువ చూపుతున్నారు. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో (market) మంచి రేట్లు ఉంటాయి. చాలా మంది ఐఐటీ విద్యార్థులు కూడా సేంద్రియ వ్యవసాయం చేపడుతూ బాగానే సంపాదిస్తున్నారు. అర ఎకరంతో కూడా ఈ సేంద్రియ వ్యవసాయం చేపట్టవచ్చు. ఈ రంగానికి కూడా మంచి డిమాండ్ (Demand) ఉంది.


కోల్డ్ స్టోరేజ్‌ (Cold storage)


చాలా చోట్ల కోల్డ్ స్టోరేజ్‌లు (Cold storages) లేకపోవడంతో పండ్లు, కూరగాయలు వంటివి త్వరగా పాడైపోతున్నాయి. అయితే కోల్డ్ స్టోరేజ్‌ బిజినెస్ కాస్త ఖర్చుతో కూడుకున్నపని. కానీ ఇందులో కూడా మంచి ఆదాయం ఉంటుంది. చిన్నపాటి కోల్డ్ స్టోరేజ్‌ (Small Cold Storage‌) ఏర్పాటు చేస్తే కూడా మీరు మంచి లాభాలు పొందుతారు.


Also Read : Todays Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా


కోళ్ల పెంపకం (Poultry farming)
కోళ్ల వ్యాపారానికి తిరుగులేదు. పౌల్ట్రీ వ్యాపారంలో (Poultry business) రెండు రకాల బిజినెస్‌లు ఉన్నాయి. గుడ్ల ఉత్పత్తి వైపు వెళ్లాలంటే లేయర్ చికెన్ (Layer chicken) ఎంచుకోవాలి. చికెన్ అమ్మాలంటే బాయిలర్ చికెన్ (Boiler chicken) ఎంచుకోవాలి. అయితే పౌల్ట్రీ నిర్వహనకు కాస్త అవగాహన కూడా ఉండాలి. కోళ్లకు వచ్చే రోగాలు, వాటికి వేసే టీకాలు తదితర అంశాలపై కాస్త ట్రైనింగ్ అవసరం. లేదంటే ఈ రంగం గురించి తెలిసిన లేబర్స్‌ ద్వారా కూడా మీరు బిజినెస్ రన్ చేయవచ్చు. పౌల్ట్రీ వ్యాపారంలో (Poultry business) బాగా కలిసొస్తే.. మంచి లాభాలు (Profits) చూడొచ్చు. దీన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభిచొచ్చు.


Also Read : India GDP FY 22: ప్రస్తుతం ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 9.2 శాతమే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి