Todays Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా

Todays Gold Rate: పసిడి ప్రియులకు కచ్చితంగా గుడ్‌న్యూస్. బంగారం ధర భారీగా తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 8, 2022, 07:13 AM IST
Todays Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా

Todays Gold Rate: పసిడి ప్రియులకు కచ్చితంగా గుడ్‌న్యూస్. బంగారం ధర భారీగా తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం దరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్ వంటి చాలా కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. కొత్త ఏడాదిలో వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధర ఇప్పుడు హఠాత్తుగా పడిపోయింది. పసిడి ప్రియులకు ఇది గుడ్‌న్యూస్. బంగారం ధర ఇవాళ ఒక్కసారిగా 16 వందల రూపాయలు తగ్గింది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి. బంగారం ధర తగ్గడం వరుసగా ఇది రెండవరోజు. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇవీ..

 దేశ రాజధాని ఢిల్లీలో ( Delhi Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల  46 వేల 750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51 వేలకు చేరుకుంది. కిలో వెండి అయితే 60 వేల 4 వందలుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబాయిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల 46 వేల 510 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 48 వేల 510 రూపాయలుంది. వెండి ధర కిలో 60 వేల 4 వందల రూపాయలుంది. కోల్‌క‌త్తాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 46 వేల 750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 49 వేల 450 రూపాయలుంది. ఇక కిలో వెండి 60 వేల 4 వందలుంది. బెంగ‌ళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 44 వేల 6 వందలుంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 48 వేల 650 రూపాయలుంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు (Gold Price) ఇలా ఉన్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర (Hyderabad Gold Price) 44 వేల 6 వందలుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 48 వేల 650 రూపాయలుంది. కిలో వెండి 64 వేల 5 వందల రూపాయలుగా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

Also read: India GDP FY 22: ప్రస్తుతం ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 9.2 శాతమే!
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News