కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకై ఎదురు చూస్తుంటే ఇదే గుడ్‌న్యూస్, IFSCA అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంట్రల్ అథారిటీలో అసిస్టెంట్ మేనేజర్ కొలువులు భర్తీ కానున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా IFSCA అధికారిక వెబ్‌సైట్ ifsca.gov.in సంప్రదించాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంట్రల్ అథారిటీలో ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. ముఖ్యంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్ని భర్తి చేయనున్నారు. ఇదొక గ్రేడ్ ఏ ఆఫీసర్ కొలువు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మీకు ఆసక్తి ఉన్నా, అర్హత ఉన్నా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు మంచి అవకాశం. ఈ అవకాశం చేజార్చుకోవద్దు. గడువు తేదీ ముగిసేలోగా త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ifsca.gov.in వెబ్‌సైట్ సందర్శించాలి. మార్చ్ 3వ తేదీ దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ.


అంటే మరో 11 రోజులే మిగిలుంది. మొత్తం 12 పదవులు ఖాళీలున్నాయి. ఈ పదవులకు దరఖాస్తు చేసే అభ్యర్ధులకు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి సైన్స్ టెక్నాలజీ, ఐటీలో పీజీ డిగ్రీ పొంది ఉండాలి. ఇతర విద్యార్హత వంటి వివరాలు పూర్తిగా వెబ్‌సైట్‌లో లభిస్తాయి. 


ఈ పదవులకు దరఖాస్తు చేసేందుకు గరిష్టంగా 30 ఏళ్లుండాలి. రిజర్వేషన్ కేటగరీ అభ్యర్ధులకు 5 ఏళ్లు మినహాయింపు ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు జనరల్ కేటగరీలో 1000 రూపాయలు, ఎస్టీ, ఎ్టీ అయితే కేవలం 100 రూపాయలుంది.


ఎంపిక ఎలా


అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసేవాళ్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. ఆ తరువాత ఇంటర్వ్యూ ఉంటుంది. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవడం మంచిది.


Also read: Supreme Court: ఎన్నికల సంఘం నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ థాక్రే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook