Income Tax Filing 2023: ఆన్లైన్లో అడ్వాన్స్ ట్యాక్స్ ఫైల్ చేయడం ఎలా..? పూర్తి వివరాలు ఇలా..!
How To File Advance tax Tax Online: చలాన్ 280ను ఉపయోగించి అడ్వాన్స్ ట్యాక్స్‌ను ఆన్లైన్లో చెల్లించవచ్చు. ఇందుకు ఆన్లైన్లో ఓ ప్రొసిజర్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.
How To File Advance tax Tax Online: స్వీయ అసెస్‌మెంట్ ట్యాక్స్, అడ్వాన్స్ ట్యాక్స్ వివిధ రకాల ఇన్‌కమ్ ట్యాక్స్‌ల చెల్లింపును సులభతరం చేయడానికి చలాన్ 280ను ఉపయోగించాల్సి ఉంటుంది. చలాన్ 280ని ఉపయోగించి ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపులను పూరించడానికి, సమర్పించడానికి రెండు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఫైల్ చేయవచ్చు. మీరు ఆఫ్‌లైన్ పద్ధతిని ఎంచుకున్నప్పటికీ.. ఈ-ఫైలింగ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) పోర్టల్ నుంచి చలాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కింది స్టెప్స్ ఫాలో అయిపోండి..
స్టెప్ 1: ముందుగా https://www.incometax.gov.in/iec/foportal వెబ్‌సైట్‌లో ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించండి. ఈ-ఫైలింగ్ ఐటీఆర్ పోర్టల్‌లోకి లాగిన్ చేయకుంటే.. లింక్‌ల కింద ఉన్న 'e-pay Tax' ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీరు ఇప్పటికే లాగిన్ చేసి ఉన్నట్లయితే.. 'e-file' విభాగం కింద ఉంటుంది.
స్టెప్ 2: 'ఇ-పే ట్యాక్స్' ఆప్షన్‌పై క్లిక్ చేసిన తరువాత కొత్త వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. ఈ-ఫైలింగ్ ఐటీఆర్ పోర్టల్‌లోకి లాగిన్ చేసిన తర్వాత లేదా నేరుగా లాగిన్ చేయకుండా యాక్సెస్ చేసినా ఈ పేజీ అలాగే ఉంటుంది. ఈ వెబ్‌పేజీలో మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాలనుకుంటున్న అసెస్‌మెంట్ సంవత్సరం (AY) వంటి వివరాలను అందించాలి. చెల్లింపు రకం ఉదా.. అడ్వాన్స్ ట్యాక్స్, స్వీయ-అంచనా ట్యాక్స్ ఈ వివరాలను పూరించండి. అనంతరం 'కంటిన్యూ' బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: అనంతరం ట్యాక్స్ మొత్తం, సర్‌ఛార్జ్ (వర్తిస్తే), సెస్ (వర్తిస్తే) మొదలైన వాటితో సహా పన్ను సంబంధిత సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. చాలా సందర్భాలలో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు, జరిమానాలు లేదా సెస్ కోసం మీరు అదనపు అడ్డు వరుసలను పూరించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సాధారణంగా 'పన్ను' వరుసలో ముందస్తు పన్ను మొత్తాన్ని నమోదు చేయడానికి సరిపోతుంది.
స్టెప్ 4: తదుపరి దశలో అడ్వాన్స్ ట్యాక్స్‌కు సంబంధించి వాస్తవ చెల్లింపు ఉంటుంది. ఈ సమయంలో రెండు చెల్లింపు ఆప్షన్లు ఉంటాయి. ఆన్‌లైన్ (డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, RTGS/NEFT, UPI, నెట్-బ్యాంకింగ్), ఆఫ్‌లైన్ (బ్యాంక్ చలాన్, RTGS/NEFT), RTGS/NEFT కోసం ఆన్‌లైన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
Also Read: TS Group 1 Prelims Exam 2023 Cancelled: గ్రూప్ 1 ప్రిలిమ్స్ మళ్లీ రద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి