How To File Income Tax Return: కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. వీటిలో ఆదాయపు పన్నుకు సంబంధించి కూడా కేంద్రం సరికొత్త అనౌన్స్‌మెంట్ చేసింది. కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ట్యాక్స్ ఉండదని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ కోసం ఐటీఆర్ ఫారమ్ కూడా అప్‌డేట్ అయింది. దీనిలో కొన్ని మార్పులు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసారి ఆదాయపు పన్ను శాఖ 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫారమ్ (ఐటీఆర్ 1-6), ఇన్‌కమ్ ట్యాక్స్ వెరిఫికేషన్ ఫారమ్ (ఐటీఆర్ V)ని నోటిఫై చేసింది. ఈ ఫారమ్‌లు 2022-23 ఆర్థిక సంవత్సరంలో చేసిన ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఉపయోగపడతాయి. 2023-24 అసెస్‌మెంట్‌కు ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31వ తేదీ వరకు సమయం ఉంది.


గత ఏడాదితో పోలిస్తే.. ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ ఫారమ్‌లను సమయానికి ముందే నోటిఫై చేసింది. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫారమ్‌లో కూడా కొన్ని మార్పులు చేసింది. ఐటీఆర్ ఫైల్ చేసే వారు మార్పుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. కొత్త ఐటీఆర్ ఫారమ్‌లు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఈ సంవత్సరం జూలై 31వ తేదీ వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.


ఈ ఐదు మార్పులు జరిగాయి..


==> మీరు 2022-23 ఆర్థిక సంవత్సరంలో క్రిప్టో, ఇతర వర్చువల్ డిజిటల్ ఆస్తుల (వీడీఏ) నుంచి ఏదైనా ఆదాయాన్ని సంపాదించినట్లయితే.. మీరు కొత్త ఐటీఆర్ ఫారమ్‌లో అందించిన ప్రత్యేక షెడ్యూల్‌లో ఆ ఆదాయ వివరాలను పొందపరచాలి.


==> ట్రేడింగ్ ఖాతాలు ఇప్పుడు ఇంట్రా-డే ట్రేడింగ్ నుంచి టర్నోవర్, ఆదాయాన్ని బహిర్గతం చేసే అవకాశాన్ని కలిగి ఉన్నాయి.


==> ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 115 బీఏసీ కింద కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వ్యక్తుల కోసం పబ్లిక్ ఆప్షన్ కూడా యాడ్ చేశారు.


==> పన్ను చెల్లింపుదారులు వారు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులా లేదా ఫారిన్ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులా అనేది వెల్లడించాలి.


==> ఐటీఆర్ 3, ఐటీఆర్ 4లో కొత్త ప్రశ్నాపత్రం జతచేశారు. దీనిలో మునుపటి సంవత్సరాల్లో కొత్త పన్ను విధానం గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.


Also Read: Tamilisai Soundararajan: కిందపడిపోయిన గవర్నర్ తమిళిసై.. ఇదే బ్రేకింగ్ న్యూస్ అంటూ కామెంట్  


Also Read: Facebook Subscription: ట్విట్టర్ బాటలో మెటా.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ బ్లూ బ్యాడ్జ్‌కు డబ్బులు వసూలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి