Income Tax: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఏ స్లాబ్‌లో ఎంత ట్యాక్స్ పే చేయాలంటే..?
Income Tax Slab Rates: ప్రస్తుతం దేశంలో రెండు పన్ను చెల్లింపు విధానాలు ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో ఏడు స్లాబ్‌లు ఉన్నాయి. మీ ఆదాయం ఎంత ఉంటే ఎంత ట్యాక్స్ చెల్లించాలి..? పూర్తి వివరాలు ఇలా..
Income Tax Slab Rates: కేంద్ర బడ్జెట్ 2023ని ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సమర్పించనున్నారు. దేశం మొత్తం చూపు ఈసారి బడ్జెట్‌పైనే ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇది కేంద్ర ప్రభుత్వం సమర్పించే పూర్తి బడ్జెట్ ఇదే. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి పలు కీలక ప్రకటనలు చేసే అవకాశాలున్నాయి. ప్రజలకు ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో రెండు ఆదాయపు పన్ను విధానాలు ఉన్నాయి. ప్రజలు రెండు విధానాల ప్రకారం ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయవచ్చు. ఒకటి పాత పన్నుల విధానం, రెండోది కొత్త పన్ను విధానం. 2020 బడ్జెట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానాన్ని ప్రకటించారు. కొత్త పన్ను విధానం పన్ను చెల్లింపుదారులకు ఐచ్ఛికం, తక్కువ ట్యాక్స్ రేటు ఉంటుంది. అయితే ఇందులో మరే ఇతర మినహాయింపులు ఉండవు. ఇందులో 7 పన్ను స్లాబ్‌లు ఉన్నాయి.
కొత్త ట్యాక్స్ విధానం ద్వారా పన్ను చెల్లింపుపై సంవత్సరానికి రూ.2.5 లక్షల ఆదాయంపై ఎలాంటి వడ్డీ ఉండదు. ఆ తరువాత రూ.2.5 నుంచి 5 లక్షల రూపాయల వార్షిక ఆదాయంపై 5 శాతం పన్ను ఉంటుంది. సంవత్సరానికి రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల ఆదాయంపై 10% ట్యాక్స్ పే చేయాలి. ఏడాదికి రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త పన్ను విధానంలో ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం పన్ను ఉంటుంది. రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయంపై 25 శాతం పన్ను విధిస్తారు. 15 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయంపై 30 శాతం చొప్పున ట్యాక్స్ చెల్లించాలి.
Also Read: Hyderabad Chain Snatching: ఎక్కడా ఫోన్ వాడకుండా చైన్ స్నాచర్స్ పక్కా స్కెచ్.. హర్యానాకు పరార్..?
Also Read: Suryakumar Yadav: మరో రికార్డుకు చేరువలో సూర్యకుమార్ యాదవ్.. చరిత్రలో మూడో ఆటగాడిగా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook