బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఇండియా కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ వరుసగా మూడవరోజు కూడా ఐటీ అధికారులు సర్వే ఆపరేషన్ పేరుతో దాడులు కొనసాగించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని మోదీపై, గుజరాత్ అల్లర్ల వ్యవహారంపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ఈ డాక్యుమెంటరీ ప్రసార లింకుల్ని కేంద్ర ప్రభుత్వం వివిధ మాధ్యమాల నుంచి తొలగించింది. ఆ తరువాత ఇదే అంశంపై బ్యాన్ విధించాలంటూ కొందరు దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు నుంచి బీబీసీకు లభించి ఊరటగా చెప్పవచ్చు. ఆ తరువాతే ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి.


దేశంలోని ఢిల్లీ, ముంబైలలో ఉన్న బీబీబీ కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు ప్రారంభించారు. ఐటీ సర్వే ఆపరేషన్ పేరుతో ఈ దాడులు వరుసగా మూడవరోజు కూడా కొనసాగాయి. దాడుల సందర్భంగా బీబీసీలోని కొంతమంది ఎంపిక చేసిన ఉద్యోగుల్నించి ఐటీ అధికారులు తమకు కావల్సిన ఆర్ధిక సంబంధిత సమాచారాన్ని, మెయిల్స్, ఇతర వివరాల్ని సేకరించారు. 


పన్ను ఎగవేత ఆరోపణలపై విచారణలో భాగంగా ఫిబ్రవరి 14 వతేదీ ఉదయం 11.30 గంటలకు బీబీసీ ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో సర్వే ఆపరేషన్ ప్రారంభించామని..45 గంటలకు పైగా సాగిందని ఐటీ అదికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఎప్పుడు పూర్తవుతుందనేది అప్పుడే చెప్పలేమని..తమకు లభించే ఆధారాల్ని బట్టి ఉంటుందని ఇన్‌కంటాక్స్ శాఖ తెలిపింది. అంతర్జాతీయ పన్నులు, బీబీసీ అనుబంధ సంస్థల ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ సమస్యల్ని పరిశోధించేందుకు సర్వే నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 


ఆర్ధిక లావాదేవీలు, కంపెనీ నిర్వహణ సమాచారం, ఇతర వివరాలపై సర్వే బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని..ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి డేటాను కాపీ చేస్తున్నామని ఐటీ అధికారులు చెప్పారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం బీబీసీ కార్యాలయాలపై దాడిని రాజకీయ చర్యగా అభివర్ణించాయి. 


Also read: Airtel Plans: చడీచప్పుడు లేకుండా 149 రూపాయల ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్‌టెల్, ప్రయోజనాలేంటంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook