Old vs New Tax Regime: ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లకు రెండు రకాల ట్యాక్స్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ కాగా రెండవది న్యూ ట్యాక్స్ రెజీమ్. రెండింట్లోనూ లాభాలు, నష్టాలు ముడిపడి ఉన్నాయి. శాలరీ ఉద్యోగులకు రెండింట్లో ఏ ట్యాక్స్ రెజీమ్ మంచిదో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ లాభాలు


ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం 2024-25 ప్రారంభమైంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారు ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ వర్సెస్ న్యూ ట్యాక్స్ రెజీమ్ రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. న్యూ ట్యాక్స్ రెజీమ్ అనేది డీఫాల్ట్‌గా ఉంటుంది. అంటే ఏ ట్యాక్స్ విధానం కావాలో ఎంచుకోకపోతే ఆటోమేటిక్‌గా మీ ట్యాక్స్ సిస్టమ్ న్యూ ట్యాక్స్ రెజీమ్‌లోకి మారిపోతుంది. రెండు ట్యాక్స్ విధానాల్లో ఉండే ప్రధానమైన తేడా డిడక్షన్.  ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్‌లో సెక్షన్ 80సి, సెక్షన్ 80 డి, సెక్షన్ 80టీటీఏ కింద వివిధ రకాల డిడక్షన్లు పొందవచ్చు. కానీ న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో ఇది సాధ్యం కాదు. ఇందులో కొన్ని స్లాబ్స్ ఉంటాయి. స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల వరకూ ఉంటుంది. 


న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో 3 లక్షల వరకూ ట్యాక్స్ ఫ్రీ


న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో 3 లక్షల వరకూ ఆదాయంపై ఎలాంటి పన్ను అవసరం లేదు. 3-6 లక్షల ఆదాయం ఉంటే 5 శాతం ట్యాక్స్ చెల్లించాలి. అదే 6-9 లక్షల ఆదాయం ఉంటే మాత్రం 10 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 9-12 లక్షల ఆదాయంపై 15 శాతం ట్యాక్స్ ఉంటుంది. అదే 12-15 లక్షల ఆదాయం కలిగితే 20 శాతం ట్యాక్స్ చెల్లించాలి. ఇక 15 లక్షల కంటే ఎక్కువ ఆధాయముంటే మాత్రం  25 శాతం చెల్లించాలి. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్‌లో 2.5 లక్షల వరకూ ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ లేదు. 2.5-5 లక్షల వరకూ ఆదాయంపై 5 శాతం ట్యాక్స్ చెల్లించాలి. అదే 5-10 లక్షల ఆదాయంపై మాత్రం 20 శాతం ట్యాక్స్ ఉంటుంది. 


మీకు వర్తించే ట్యాక్స్ మినహాయింపులు, మీ ఉద్యోగం, మీ జీతంను బట్టి ట్యాక్స్ రెజీమ్ ఎంచుకోవల్సి ఉంటుంది. ట్యాక్స్ డిడక్షన్ ప్రయోజనాలు మీకు అధికంగా ఉంటే అవి అప్లే చేసుకునేందుకు ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ మంచి ఆప్షన్. ట్యాక్స్ డిడక్షన్ అవసరం లేదనుకుంటే న్యూ ట్యాక్స్ రెజీమ్ ఎంచుకోవాలి.


Also read: FD Rates: ఎఫ్‌డీపై అత్యధికంగా 9 శాతం వడ్డీ ఇస్తున్న బ్యాంకుల జాబితా ఇదే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook