Cairn Energies Dispute: బ్రిటన్ సంస్థ కెయిర్న్ ఎనర్జీస్, భారతదేశ ప్రభుత్వం మధ్య వివాదం సమసిపోనుంది. ఆ దిశగా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అసలు ఇండియా-కెయిర్న్ ఎనర్జీస్ మధ్య తలెత్తిన ఆ వివాదమేంటో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియా, కెయిర్న్ ఎనర్జీస్(India-Cairn Energies) మధ్య రెట్రోస్పెక్టివ్ పన్ను విషయంలో వివాదంలో తలెత్తింది. గతంలో ఆ సంస్థ నుంచి వసూలు చేసిన బిలియన్ డాలర్లను కెయిర్న్ ఎనర్జీస్‌కు భారత ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. అదే సమయంలో ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వ ఆస్థుల స్వాధీనం కోసం ఆ సంస్థ పలుదేశాల్లో వేసిన కేసుల్ని ఉపసంహరించుకోవల్సి ఉంటుంది. రెట్రోస్పెక్టివ్ చట్టం ప్రకారం ఇండియా..గతంలో కెయిర్న్ ఎనర్జీస్ నుంచి 7 వేల 9 వందల కోట్లను వసూలు చేసింది. ఇప్పుడు రెట్రోస్పెక్టివ్ చట్టం రద్దుకు భారత పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది.


రెట్రోస్పెక్టివ్ పన్నును(Retrospective tax) తిరిగి చెల్లించే విషయమై ఇండియా ఇచ్చిన ఆఫర్‌పై కెయిర్న్ ఎనర్జీస్(Cairn Energies) సానుకూలంగా స్పందించింది. ఆ ఆఫర్ తమకు ఆమోదయోగ్యమేనని సంస్థ తెలిపింది. భారత ప్రభుత్వం నుంచి చెల్లింపులు అందిన వెంటనే ప్యారిస్‌లోని భారత రాయబార కార్యాలయ అపార్ట్‌మెంట్లు, అమెరికాలోని ఎయిర్ ఇండియా విమానం జప్తుకు సంబంధించిన కేసుల్ని వెనక్కి తీసుకుంటామని చెప్పింది. ఆ సంస్త వాటాదారులైన బ్లాక్‌రాక్, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ సంస్థలు కూడా ఈ ఆఫర్‌కు అంగీకరించాయి. ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న వివాదాన్ని ముగించి..ఆఫర్ ఇచ్చినప్పుడు ఆమోదించడం మంచిదని కంపెనీ అభిప్రాయపడింది. 2012 నాటి రెట్రోస్పెక్టివ్ పన్ను చట్టం కింద 50 ఏళ్లనాటి లావాదేవీలపై కూడా ప్రభుత్వం పన్ను వేసే హక్కు కలిగి ఉంటుంది. 


Also read: Whats App New feature: వాట్సప్‌లో నయా ఫీచర్.. అన్ని హైడ్ చేసేయొచ్చు..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook