IMD Top Companies: ప్రపంచంలో పటిష్ఠ కంపెనీలుగా టెస్లా, గూగుల్ సంస్థలు నిలుస్తాయని ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ నివేదిక వెలువరించింది. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన కంపెనీలు లేకపోవడం గమనార్హం. కారణమేంటంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్విట్జర్లాండ్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ వెలువరించి ప్రపంచ పటిష్ట కంపెనీల జాబితా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితుల్ని తట్టుకునేందుకు ఏ కంపెనీలు సన్నద్ధంగా ఉన్నాయనేది దాదాపు పదేళ్ల డేటా అధ్యయనం అనంతరం నిర్ణయించారు. ఫ్యాషన్, రిటైల్, ఆటోమోటివ్, ఆర్ధిక సేవలు, టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్న 86 లిస్టెడ్ కంపెనీలను, పోటీ కంపెనీలను సరిపోల్చి నివేదిక సిద్ధం చేసింది ఐఎండీ. ఈ జాబితా ప్రకారం టెక్నాలజీ రంగంలో గూగుల్(Google), అమెజాన్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు, ఆటోమోటివ్ రంగంలో టెస్లా(Tesla), టొయోటాలు అగ్రస్థానంలో నిలవగా, ఆర్ధిక సేవల విషయంలో మాస్టర్ కార్డ్, వీసాలు ఉన్నాయి. ఇక రిటైల్ రంగంలో లులు లెమన్, నైకీలు అగ్రస్థానంలో నిలిచాయి. 


ఇండియన్ కంపెనీలు ఎందుకు లిస్టెడ్ కాలేదు


ఐఎండీ జాబితాలో(IMD List) ఏ ఒక్క భారతీయ కంపెనీ కూడా స్థానం సంపాదించలేకపోయింది. దీనికి కారణం ఇండియాలో మౌళిక సదుపాయాల సమస్యని ప్రొఫెసర్ హోవార్డ్ యు స్పష్టం చేశారు. ఆటోమోటివ్ రంగంలో టాప్ కంపెనీల్లో ఇండియా ప్రాతినిధ్యమే లేదని ఐఎండీ నివేదిక సిద్ధం చేసిన ప్రొఫెసర్ హోవార్డ్ చెప్పారు. భవిష్యత్ తరం స్మార్ట్ వాహనాలన్నీ సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్స్‌పైనే ఆధారపడి ఉంటాయి. దేశంలోని టాటా, మహీంద్రా కంపెనీలు ఆ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోవడమే కారణంగా తెలుస్తోంది. చైనాలోని కొన్ని ఆటోమోటివ్ కంపెనీలు సొంత నెట్‌వర్క్‌తో పాటు ప్రభుత్వ మౌళిక సదుపాయాల ప్రయోజనం పొందుతున్నాయి. వ్యాపార నిర్వహణకు అంతర్జాతీయ ప్రమాణాల్ని అందుకోవడంలో ఇండియాకు ఇంకా సమయం పడుతుందని చెప్పారు. అయితే స్టార్టప్‌ల పరంగా మాత్రం ఇండియా  చైనాను అధిగమించిందన్నారు. ఫ్లిప్‌కార్ట్(Flipkart) ,స్నాప్‌డీల్, ఓలా వంటివి దేశీయ స్టార్టప్ వ్యవస్థలో సంచలనం రేపాయన్నారు. 


Also read: BCCI vs Team India Captains: బీసీసీఐపై వ్యతిరేకత కనబర్చిన మాజీ ఇండియా కెప్టెన్లు ఎవరో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook