Indian Railway Refund Rules: రైళ్లలో నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. దూర ప్రయాణాలకు అయితే ముందుగా టికెట్లు రిజర్వేషన్ చేసుకుని ప్లాన్ చేసుకుంటారు. అయితే ఒక్కోసారి ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తే సీటు రిజర్వ్ చేసుకునేందుకు ఇబ్బంది పడతారు. రేపు జర్నీ ఉందనగా.. ఒక రోజు ముందుగా తాత్కల్‌లో టికెట్ బుక్ చేసుకుంటారు. అయితే రెగ్యులర్ టికెట్ ధర కంటే.. తత్కాల్ టికెట్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ టికెట్లు క్షణాల్లో అయిపోతాయి. బుకింగ్స్ ప్రారంభమైన ఐదు నిమిషాల్లో దాదాపు అన్ని టికెట్లు ఖాళీ అయిపోతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తత్కాల్‌లో వెయిటింగ్ లిస్టులో ఉంటే టికెట్ కన్ఫార్మ్ అవ్వడం దాదాపు కష్టమే. టికెట్ కన్ఫార్మ్ అయితే కోచ్, బెర్త్ నంబరుతో మీకు టికెట్ వస్తుంది. తత్కాల్ బుకింగ్స్ వెయిటింగ్ లిస్టులో టికెట్ కన్ఫార్మ్ అవుతుందా..? క్యాన్సిల్ చేయకపోతే మన డబ్బులు తిరిగి వస్తాయా..? అనే చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. రైల్వే రూల్స్ ప్రకారం.. తాత్కల్‌లో వెయిటింగ్ లిస్టులో టికెట్‌తో ప్రయాణం చేసేందుకు వీలు లేదు. 


తత్కాల్‌లో మీ వెయిటింగ్ లిస్టులో ఉంటే ఆటోమెటిక్‌గా అది క్యాన్సిల్ అవుతుంది. రైల్వే నిబంధనల ప్రకారం.. బుకింగ్ ఛార్జీని తీసివేసిన తర్వాత మిగిలిన డబ్బును మీ ఖాతాలోకి జమ చేస్తుంది రైల్వే శాఖ. వెయిటింగ్ టిక్కెట్లపై ఈ ఛార్జీ సాధారణంగా మొత్తం ధరలో 10 శాతం వరకు ఉంటుంది. అయితే రైలు, సీటు తరగతిని బట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఏసీ క్లాస్‌లో టికెట్ క్యాన్సిల్ అయితే.. రూ.100-150 వరకు ఛార్జీలు కట్ చేసి.. రీఫండ్ చేస్తారు. 


ఏసీతో పోలిస్తే స్లీపర్ క్లాస్‌లో బుకింగ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. మీరు ఆన్‌లైన్ టికెట్ బుక్ చేస్తే.. రీఫండ్ డబ్బులు నేరుగా మీ అకౌంట్‌లోకి వస్తాయి. ఒకవేళ మీరు కౌంటర్ నుంచి టికెట్ చేసినట్లయితే.. రీఫండ్ కోసం కౌంటర్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. 


Also Read: TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు, మార్కుల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Also Read: Jangaon MLA Muthireddy Yadagiri Reddy: ప్రత్యర్ధులు నా బిడ్డను ఉసిగొల్పారు.. ఫోర్జరీ కేసుపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రియాక్షన్ ఇదే..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి