ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ కొన్ని కొన్ని పేర్లు మారుతుంటాయి. ఇటీవలి కాలంలో ఊర్లు, నగరాలు, ప్రాంతాల పేర్లు పెద్దఎత్తున మారుతున్నాయి. ఇప్పుడా పరిస్థితి రైళ్లకూ విస్తరించేసింది. రైళ్ల పేర్లు కూడా మారిపోతున్నాయి. రైల్వైశాఖ అధికారికంగా రెండు రైళ్ల పేర్లను మార్చడంతో పాటు కొత్త రైల్వే టైమ్ టేబుల్ అమలు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైల్వేశాఖ కొత్తగా రెండు రైళ్ల పేర్లను మార్చుతూ అధికారికంగా ప్రకటించింది. టిప్పూ ఎక్స్‌ప్రెస్ పేరును వడయార్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చగా..తలగుప్ప-మైసూర్ ఎక్స్‌ప్రెస్ రైలు పేరను కువెంపు ఎక్స్‌ప్రెస్‌గా మార్చింది. ఈ రెండూ కర్ణాటక రాష్ట్రంలో నడుస్తున్న రైళ్లు కావడం విశేషం. రైల్వే బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ దీనికి సంబంధించి అధికారికంగా లేఖ కూడా జారీ చేసింది. 


సూపర్ ఫాస్ట్ రైళ్ల జాబితాలో 130 రైళ్లు


రైల్వే బోర్డ్ ప్రకారం 500 మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్పీడ్ పెరిగింది. ఇండియన్ రైల్వేస్ కొత్త టైమ్ టేబుల్ ప్రకారం 500 మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని ఇటీవల పెంచారు. మరోవైపు 130 రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్ల జాబితాలో చేర్చారు. దాదాపు అన్ని రైళ్ల వేగాన్ని 5 శాతం వరకూ పెంచింది రైల్వేశాఖ. ఫలితంగా అదనపు రైళ్ల నిర్వహణకు మార్గం సుగమమైంది. అదే సమయంలో ఆల్ ఇండియా రైల్వే టైమ్ టేబుల్ ఇష్యూ అయింది. కొత్త రైళ్ల టైమ్ టేబుల్‌ను TRAINS AT A GLANCEలో చెక్ చేసుకోవచ్చు. కొత్త టైమ్ టేబుల్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. 


Also read: Cough Syrup Tragedy: 66 మంది చిన్నారుల ప్రాణాల్ని చిదిమేసిన దగ్గు మందు, డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికతో మేల్కొన్న కేంద్రం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook