Indian Railways Concession: రైల్లో ప్రయాణించే వృద్ధులకు గతంలో ఇండియన్ రైల్వేస్ రాయితీ ఇచ్చేది. కానీ, కరోనా సంక్షోభం కారణంగా వివిధ రాయితీలను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వృద్ధులకు ఇచ్చే రాయితీని కూడా అధికారులు రద్దు చేశారు. అయితే కరోనా సంక్షోభం తర్వాత పరిస్థితులు మెరుగైన సందర్భంగా ఇటీవలే పూర్తి స్థాయి సేవలను భారతీయ రైల్వే శాఖ పునఃప్రారంభించింది. ఈ నేపథ్యంలో వృద్ధులకు ఇచ్చే రాయితీని తిరిగి ప్రవేశపెట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖను సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ కోరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ జాతీయ మీడియా ఇచ్చిన నివేదిక ప్రకారం.. దేశంలోని సీనియర్ సిటిజన్స్ కు సంబంధించిన అనేక పథకాల తాలూకూ ఫండ్ రూ. 1.25 లక్షల కోట్లకు పైగా ఉంది. దీంతో వృద్ధులు అవసరాల మేరకు వారికి రాయితీలు కల్పించాలని సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ డిమాండ్ చేస్తోంది. 


రైల్వేస్ లో సీనియర్ సిటిజన్స్ సహా మూడు కేటగిరీలు మినహా అన్నింటికి ఛార్జీలలో రాయితీని నిలిపివేశారు. దాదాపుగా 14 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ సదుపాయాన్ని తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై స్పష్టత లేదు. అయితే ప్రస్తుతం రైల్లో ప్రయాణించే వృద్ధుల నుంచి వస్తున్న డిమాండ్స్ ప్రకారం.. వారికి గతంలో మాదిరి రాయితీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. 


లోక్ సభలో రైల్వే మంత్రి ప్రకటన..


కరోనా సంక్షోభం నుంచి గత రెండేళ్లుగా దాదాపుగా 7 కోట్ల మంది వృద్ధులు ఎలాంటి రాయితీలు లేకుండానే ప్రయాణిస్తున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే లోక్ సభలో వెల్లడించారు. 


(ఇన్‌పుట్ - IANS)


Also Read: BSNL Recharge: BSNLలో ఉత్తమ ప్లాన్.. తక్కువ ఖర్చుతో 110 రోజుల వ్యాలిడిటీ!


Also Read: Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ కారు.. ఒక్కసారి చార్జింగ్​తో 400 కిమీ.. మరెన్నో కొత్త ఫీచర్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook