India GDP FY 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 9.2 శాతంగా నమోదవ్వచ్చని (India Growth rate for 2021-2022) ప్రభుత్వం అంచనా వేస్తోంది. శుక్రవారం విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక గత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 7.3 శాతం క్షీణించిన విషయం (Govt on India GDP) తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా రెండో దశకు ముందు దేశ జీడీపీ రెండంకెల వృద్ధి నమోదు చేస్తుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్​బీఐ సహా, వివిధ రేటింగ్ ఏజెన్సీలు కూడా రెండంకెల వృద్ధి నమోదవుతుందని అంచనా వేశాయి.


అనుహ్యంగా కొవిడ్ రెండో దశ రావడంతో వృద్ధి రేటు అంచనాలను (Corona impact on India GDP) భారీగా సవరించాల్సిన అవసరం ఏర్పడింది. కరోనా రెండోదశ అనంతరం కూడా ప్రభుత్వం రెండంకెల వృద్ధి రేటుపై ధీమా వ్యక్తం చేయగా.. ఇప్పుడు మళ్లీ కొవిడ్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో అంచనాలను దిగువకు సవరించినట్లు (Corona fears in India) తెలుస్తోంది.


ప్రభుత్వం అంచనాలు ఇలా..


జులై-సెప్టెంబర్ మధ్య ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలోకి వచ్చినట్ల ప్రభుత్వం పేర్కొంది. కొవిడ్ సెకండ్ వేవ్​ ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ సమయంలో ఆర్థిక వ్యవస్థ దాదాపు సాధారణ స్థితికి చేరినట్లు వివరించింది.


గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2021-22 రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ 8.4 శాతం వృద్ధిని నమోదు (India GDP in Q2) చేసినట్లు వెల్లడించింది.


ప్రస్తుత ఆర్థిక సంవత్సర వాస్తవిక జీడీపీ రూ.147.54 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. 2020-21లో ఇది రూ.135.13 లక్షల కోట్లుగా తుది అంచనాల్లో (India real GDP) పేర్కొంది.


ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 9.5 శాతంగా నమోదవ్వచ్చని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) ఇది వరకే (RBI on India GDP) అంచనాలను విడుదల చేసింది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం సగటున 5.3 శాతంగా ఉంటుందని (RBI on India inflation) పేర్కొంది.


Also read: Covid third wave E‌‌-Commerce sales: థర్డ్‌ వేవ్ తరుముకొస్తోంది.. అందుకే అక్కడ సేల్స్ పెరిగాయ్!!


Also read: Stock Market today: వారాంతంలో స్టాక్ మార్కెట్లకు లాభాలు- 59,700పైకి సెన్సెక్స్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook