Top Selling SUV: మార్కెట్‌లో అన్ని ఎస్‌యూవీలను వెనక్కి నెట్టేసిన టాటా పంచ్, కారణమేంటి
Top Selling SUV: దేశంలో ఇటీవలి కాలంలో ఎస్‌యూవీ క్రేజ్ పెరుగుతోంది. ఒక్కోసారి ఒక్కో ఎస్‌యూవీ మార్కెట్‌లో హల్చల్ చేస్తుంటోంది. ఇప్పుడు మరోసారి ఆ కంపెనీ ఎస్‌యూవీ మిగిలిన అన్ని ఎస్‌యూవీల్ని వెనక్కి నెట్టేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Top Selling SUV: ఇండియన్ కార్ మార్కెట్‌లో టాటా కంపెనీ కార్లకు ఓ ప్రత్యేక స్థానముంది. మారుతి సుజుకి తరువాత టాటా కంపెనీ కార్లకే ఎక్కువ ఆదరణ. గత కొద్దికాలంగా ఎస్‌యూవీ మార్కెట్‌లో టాటా తన ఆధిక్యతను నిలబెట్టుకుంటోంది. టాటా పంచ్ అత్యధికంగా విక్రయమౌతూ రికార్డు నెలకొల్పుతోంది.
భారతీయ మైక్రో ఎస్‌యూవీ విభాగంలో ప్రాచుర్యం పొందిన కారు టాటా పంచ్. మార్కెట్‌లో అత్యధిక వాటా ఈ విభాగంలో ఈ కారుదే. అనతి కాలంలోనే మార్కెట్‌లో పట్టు సాధించింది. ఇప్పుడు కూడా టాటా పంచ్ తన ఆధిక్యతను కొనసాగిస్తోంది. ఆగస్టు నెల విక్రయాల్లో టాటా పంచ్ అత్యధిక విక్రయాల్లో రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో మారుతి బ్రిజా నిలిచింది. బ్రిజా కాకుండా మిగిలిన అన్ని ఎస్‌యూవీల్ని టాటా పంచ్ వెనక్కి నెట్టేయడం విశేషం. హ్యుండయ్ క్రెటా, టాటా నెక్సాన్, హ్యుండయ్ వెన్యూ వంటి దిగ్గజ ఎస్‌యూవీలు కూడా టాటా పంచ్ ముందు వెనుకబడిపోయాయి. మరోవైపు మారుతి బ్రిజా మొదటి స్థానంలో ఉన్నా..టాటా పంచ్‌తో పోలిస్తే వ్యత్యాసం పెద్దగా లేదు. మారుతి బ్రిజా, టాటా పంచ్ విక్రయాల్లో కేవలం 49 యూనిట్ల విక్రయాలే వ్యత్యాసముంది.
టాటా పంచ్ ప్రత్యేకతలు, వివరాలు
టాటా పంచ్ అతి తక్కువ సమయంలో మార్కెట్‌లో పట్టు సాధించింది. ఇండియాలో మైక్రో ఎస్‌యూవీ విభాగంలో ప్రాచుర్యం పొందింది. టాటా పంచ్ ధర 6 లక్షల నుంచి 9.52 లక్షల వరకూ ఉంది. ఇది సింగిల్ ఇంజన్ 1.2 లీటర్ పెట్రోల్ వెర్షన్‌లో వస్తోంది. అయితే ఇందులో రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు, 5 స్పీడ్ మేన్యువల్, ఏఎంటీ ఆప్షన్ ఉంది. పెట్రోల్ ఇంజన్ 86 పీఎస్, 113 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు.అటు సీఎన్జీ మోడ్‌లో పవర్ అవుట్‌పుట్ తగ్గుతుంది. సీఎన్జీ వేరియంట్ అయితే 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్‌తో వస్తోంది.
ఇది 5 మీటర్ మైక్రో ఎస్‌యూవీ. ఇందులో 366 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 187 మిల్లీమీటర్లుగా ఉంది. టాటా పంచ్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్ లైట్స్ -వైపర్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఏసీ, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్, రేర్ పార్కింగ్ కెమేరా, ఈబీడీ విత్ ఏబీఎస్ ఫీచర్లు ఉన్నాయి.
టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఆగస్టు నెలలో
మారుతి బ్రిజా 14, 572 యూనిట్లు
టాటా పంచ్ 14, 5123 యూనిట్లు
హ్యుండయ్ క్రెటా 13,832 యూనిట్లు
మారుతి ఫ్రాంక్స్ 12,164 యూనిట్లు
మారుతి గ్రాండ్ విటారా 11,818 యూనిట్లు
Also read; High Profits Returns Stocks: భారీ లాభాలు ఇచ్చే 5 స్టాక్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook