Evergreening: కస్టమర్ల సమ్మతి లేకుండానే రుణాలిచ్చేసిన బ్యాంకు
Evergreening: మీకు తెలియకుండానే మీ బ్యాంకు ఖాతాల్లో రుణం వచ్చి పడుతుందా. లేదు కదా. కానీ అదే జరిగింది. కస్టమర్ల అనుమతి లేకుండానే ఆ బ్యాంకు రుణాలిచ్చేసిందట. నిజం మరి స్వయంగా ఆ బ్యాంకే ఒప్పుకున్న వాస్తవమిది. అదేంటో చూద్దాం.
Evergreening: మీకు తెలియకుండానే మీ బ్యాంకు ఖాతాల్లో రుణం వచ్చి పడుతుందా. లేదు కదా. కానీ అదే జరిగింది. కస్టమర్ల అనుమతి లేకుండానే ఆ బ్యాంకు రుణాలిచ్చేసిందట. నిజం మరి స్వయంగా ఆ బ్యాంకే ఒప్పుకున్న వాస్తవమిది. అదేంటో చూద్దాం.
కస్టమర్ల సమ్మతి లేకుండా బ్యాంకు రుణాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇది నిజంగా ఆనందించాలో ఆందోళన చెందాలో తెలియని పరిస్థితి. ఇండస్‌ఇండ్ బ్యాంకు(IndusInd Bank) ఖాతాదారుల విషయంలో జరిగింది ఇదే. సాంకేతిక సమస్యల కారణంగా రుణగ్రహీతల సమ్మతి లేకుండా ఈ ఏడాది మే నెలలో 84 వేల రుణాలను మంజూరు చేసినట్లు స్వయంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ తెలిపింది. ఈ రుణాలు తమ అనుబంధ సంస్థ భారత్ ఫినాన్షియల్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్ మంజూరు చేసినట్లు పేర్కొంది. అయితే సాంకేతిక సమస్యల వల్లనే ఇది జరిగిందని బ్యాంకు చెబుతోంది.
ఎవర్ గ్రీనింగ్ అంటే
అయితే బ్యాంకులు అవలంభించే ఎవర్ గ్రీనింగ్‌లో(Evergreening) భాగంగానే ఇండస్‌ఇండ్ ఇలా చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల్ని మాత్రం బ్యాంకు ఖండించింది. ఎవరైనా రుణం తీసుకొని తిరిగి చెల్లించే పరిస్థితిలో లేకపోతే.. బ్యాంకులు మరోసారి వారికి అదనపు రుణం ఇచ్చి పాత రుణం ఖాతాలో జమచేసుకుంటాయి. రుణ కాలపరిమితి ముగిసిన ప్రతిసారీ ఇలాగే పునరుద్ధరిస్తూ వెళ్తాయి. దీని వల్ల రుణగ్రహీతకు రుణం పొందే అర్హత పెరుగుతుంది. అలాగే బ్యాంకుల పద్దు పుస్తకాల్లో మొండి బకాయిల మొత్తం తగ్గుతుంది. బ్యాంకు మంజూరు చేసిన రుణం మాత్రం ఎప్పటికీ వసూలు కాదు. దీన్నే ఎవర్‌గ్రీనింగ్ అంటారు. ఇది భారత బ్యాంకింగ్ వ్యవస్థలో తరచూ జరుగుతుంటుంది.
నియంత్రణ సంస్థలు మాత్రం ఈ విధానాన్ని అస్సలు అనుమతించవు. తాజాగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ మంజూరు చేసిన 84 వేల రుణాలు(IndusInd Loans without Customer Consent) కూడా ఎవగ్రీనింగ్‌లో భాగమనేది ఓ ఆరోపణ. దీనిపై స్పందించిన ఇండస్ఇండ్ బ్యాంక్ అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. సాంకేతిక సమస్య వల్లే మే నెలలో రుణగ్రహీతల అనుమతి లేకుండా రుణాలు మంజూరయ్యాయని తెలిపింది. పైగా 84 వేల రుణాల్లో కేవలం 26 వేల 73 మాత్రమే క్రియాశీలకంగా ఉన్న పాత రుణగ్రహీతలకు అందాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎవర్‌గ్రీనింగ్‌కు అవకాశమే లేదని తెలిపింది. క్షేత్రస్థాయిలో ఉండే తమ సిబ్బంది రెండు రోజుల్లో సమస్యను గుర్తించారని వెల్లడించింది. దీంతో వెంటనే సమస్యను పరిష్కరించామని పేర్కొంది. దీనిపై స్వతంత్ర సమీక్ష జరుగుతోందని తెలిపింది. అవసరమైన చర్యలు తీసుకొని రుణాలు వసూలు చేస్తామని తెలిపింది.
Also read: Gold Price today: దేశీయంగా బంగారం ధరల్లో మరోసారి పెరుగుదల, ఏ నగరంలో ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook