How Railways Started Toilet Facility First Time in Trains: ఇండియాలో తొలి రైలు బ్రిటీషు హయాంలో 1853లో నడిచింది. ఆశ్చర్యమేమంటే తొలి రైలు ప్రారంభమైన 56 ఏళ్ల వరకూ రైళ్లలో అసలు టాయ్‌లెట్స్ సౌకర్యమే లేదు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అంతకంటే ఆశ్చర్యం కల్గించే మరో విషయం రైళ్లలో టాయ్‌లెట్స్ సౌకర్యం ఏర్పాటు కారణం ఓ భారతీయుడే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1853లో తొలి రైలును బ్రిటీషు పాలకులు నడిపినా 56 ఏళ్ల వరకూ టాయ్‌లెట్ సౌకర్యమనేది లేనేలేదు. ఓ ప్రయాణీకుడికి ఎదురైన ఓ ఘటన నేపధ్యంలో టాయ్‌లెట్స్ సౌకర్యం ఏర్పడింది. ఈ సంఘటన వింటే నవ్వుకోకతప్పదు. కానీ ఆ సంఘటన బ్రిటీషుని ఆలోచింపజేసింది. రైళ్లలో టాయ్‌లెట్స్ ఏర్పాటుకు కారణమైంది.


సుదూర ప్రయణాలు చేసేటప్పుడు బడ్జెట్, సౌకర్యం దృష్ట్యా ఎక్కువమంది రైలు ప్రయాణాన్నే ఇష్టపడుతుంటారు. రైళ్లలో సుదూర ప్రయాణం మంచి అనుభవాన్నిస్తుంది. మనోరంజకంగా ఉంటుంది. ఒకవేళ రైళ్లలో టాయ్‌లెట్స్ లేకుంటే దేశంలో రైళ్లకు ఇంత ఆదరణ లభించి ఉండేదా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే రైలు ప్రారంభమైన 56 ఏళ్ల వరకూ టాయ్‌లెట్ సౌకర్యం లేదు.  మరోవైపు ఆ కాలంలో రైళ్లు కూడా చాలా తక్కువ వేగంతో నడిచేవి. అంటే రైల్వే యాత్రికులు ఎంత ఇబ్బందులు పడేవారో ఊహించుకోగలరా..


ఇండియాలో తొలి రైలు 1853 ఏప్రిల్ 6వ తేదీన ముంబై నుంచి పూణే మధ్య నడిచింది. ఆ తరువాత చాలా దశాబ్దాల వరకూ అంటే 1919 వరకూ రైళ్లలో టాయ్‌లెట్స్ లేకుండానే రైలు ప్రయాణాలు జరిగేవి. 1919లో బ్రిటీషు రైల్వే శాఖకు లభించిన ఓ లేఖ మొత్తం స్వరూపాన్ని మార్చేసింది. ఆ లేఖ తరువాతే రైళ్లలో టాయ్‌లెట్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఆ లేఖ రాసింది ఓ భారతీయుడు. పేరు ఓఖిల్ చంద్రసేన్. ఆంగ్లేయులకు తన బాధల్ని లేఖ ద్వారా వివరించాడు. 1909 జూలై 2వ తేదీన రాసిన లేఖ ఇది. ఇందులో తనకెదురైన అనుభవాన్ని విన్నవించుకున్నాడు.


Also Read: Best Saving Schemes 2023: ఈ మూడు పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి.. తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం


ఆ లేఖలో ఏముందంటే..


డియర్ సర్..నేను రైళ్లో అహ్మదాబాద్ స్టేషన్ వరకూ వచ్చాను. ఇంతలో నా కడుపులో గందరగోళం ఏర్పడింది. కడుపు ఉబ్బిపోయింది. టాయ్‌లెట్ వెళ్లేందుకు స్టేషన్‌లో ఓ పక్కకు వెళ్లాను. ఇందులో గార్డ్ విజిల్ వేయడంతో రైలు కదిలిపోయింది. ఓ చేతిలో నీళ్ల చెంబు, మరో చెతిలో ధోతీ పట్టుకుని పరుగెట్టాను. ప్లాట్‌ఫామ్‌పై పడిపోయాను కూడా. నా ధోతీ కూడా ఊడిపోయింది. దాంతో అక్కడున్న మహిళలు, మగవారు అందరి ముందు సిగ్గుతో తలదించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. నా రైలు కూడా మిస్సయిపోయింది. అహ్మదాబాద్ స్టేషన్ దగ్గర ఆగిపోవల్సి వచ్చింది. ఇదెంత దుఖించాల్సిన విషయమో మీకు తెలుసా..? టాయ్‌లెట్‌కు వెళ్లిన ఓ ప్రయాణీకుడి కోసం గార్డ్ కాస్సేపు రైలు ఆపలేకపోయాడు. అందుకే ఆ గార్డుకు జరిమానా విధించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను లేకపోతే ఈ విషయాన్ని మీడియాకు చెప్పేస్తాను. ఇట్లు మీ విశ్వసనీయుడు, ఓఖిల్ చంద్రసేన్.


ఈ లేఖ తరువాత బ్రిటీషు రైల్వేశాఖ ఈ విషయంపై ఆలోచించింది. లేఖను జోక్‌గా తీసుకోకుండా అందులో ఉన్న సివియారిటీని గుర్తించింది. వెంటనే రైళ్లలో టాయ్‌లెట్ సౌకర్యం కల్పించే దిశగా ఆలోచించి ఆ తరువాత కాలక్రమంలో ఆ ఏర్పాటు చేసింది.


Also Read: Best 5G Smartphones: అద్భుత ఫీచర్లతో అత్యంత చౌకైన 5జి స్మార్ట్‌ఫోన్‌లు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook