iPhone in Rs 20,000: ఐఫోన్ ప్రియులకు బంపరాఫర్.. రూ 20 వేలకే కొత్త ఐఫోన్
Cheap And Best iphone: ఐఫోన్ అంటేనే ఏదో మాటల్లో చెప్పలేని క్రేజ్. ఐఫోన్ చేతిలో ఉంటే చాలు... ప్రపంచాన్నే ఏలినంత ఆనందంగా ఫీలయ్యే వాళ్లు ఉన్నారు. ఖరీదైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నా లేకున్నా.. ఒక్క ఐఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇంకేదీ అవసరం లేదనుకునే వాళ్లకూ కొదువే లేదు.
Cheap And Best iphone: ఐఫోన్ అంటేనే ఏదో మాటల్లో చెప్పలేని క్రేజ్. ఐఫోన్ చేతిలో ఉంటే చాలు... ప్రపంచాన్నే ఏలినంత ఆనందంగా ఫీలయ్యే వాళ్లు ఉన్నారు. ఖరీదైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నా లేకున్నా.. ఒక్క ఐఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇంకేదీ అవసరం లేదనుకునే వాళ్లకూ కొదువే లేదు. ఐఫోన్ మెయింటెన్ చేయడం ఒక సోషల్ స్టేటస్‌గా భావించి కొనుక్కునే వాళ్లున్నారు.. ఐఫోన్ దగ్గరుంటే మిగతావన్నీ వాటంతటవే వస్తాయని అనుకునే వాళ్లూ ఉన్నారు. మొత్తంగా చెప్పాలంటే.. ఐఫోన్... ఒక అవసరానికి మించి ఇంకేదో ఉందనుకునేలా ఐఫోన్‌పై జనానికి ఉన్న ఇష్టం గురించి ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి.
ఐఫోన్ వినియోగించే వాళ్లలో కూడా కొంతమంది ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే కొత్త మోడల్ ఫోన్స్ కొనే వాళ్లు ఒక రకమైతే.. ఐఫోన్ అయితే చాలు.. అది పాత మోడల్ అయితేనేం కొత్త మోడల్ అయితేనేం అని సరిపెట్టుకుని అందులోనే పూర్తి సంతృప్తి పొందే వాళ్లు ఉన్నారు. ఎవరి ఇష్టాయిష్టాలు, ఎవరి మైండ్‌సెట్ ఎలా ఉన్నా.. మొత్తానికి ఐఫోన్ కొనడం మాత్రం రెండింట్లోనూ కామన్ పాయింట్ ఉండటం గమనించే ఉండి ఉంటారు. ఇప్పుడు ఐఫోన్ వినియోగదారుల గురించి క్లాసిఫై ఎందుకు చేస్తున్నట్టు అని అనుకుంటున్నారా ? అయితే కొద్దిసేపాగండి.. అక్కడికే వస్తున్నాం. ఇదిగో ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోయే ఐఫోన్ ఆఫర్ కూడా ఎంతోమందిని ఆకట్టుకున్న ఐఫోన్ 11 గురించే.
ఐఫోన్‌లో కొత్త మోడల్స్ మార్కెట్‌లోకి వస్తున్నప్పటికీ.. వాటి ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటున్నందున తమకు అందుబాటులో ఉన్న చిన్న బడ్జెట్‌లో పాత మోడల్స్‌ని ఎంచుకునే వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే ఐఫోన్ 11పై ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ద్వారా యాపిల్ ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ ది బెస్ట్ ఆఫర్ అందిస్తోంది.
సాధారణంగా అయితే ప్రస్తుతం ఐఫోన్ 11 మోడల్ 64GB వేరియంట్ ఖరీదు 43,900 గా ఉండగా.. డిస్కౌంట్ తర్వాత దీని ఖరీదు 36,990 కి లభిస్తుంది. ఈ డిస్కౌంట్ మాత్రమే కాకుండా మీ వద్ద ఉన్న పాత ఐఫోన్ కానీ లేదా ఏదైనా ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఉంటే.. దానిని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా మరో రూ. 16990 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ లభిస్తోంది. అంటే రూ. 20 వేలకే ఐఫోన్ వచ్చేస్తోందన్నమాట. అంతేకాదండోయ్.. ఐసిఐసిఐ డెబిట్ కార్డుతో అదనంగా కొంత క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఐఫోన్ 11 ని చీప్ అండ్ బెస్ట్ ధరలో కొనాలి అనుకుంటే ఇదే రైట్ టైమ్. ఇంకేం.. పండక్కి తక్కువ ధరలో ఐఫోన్ వచ్చేసిందన్నమాట. ఐఫోన్ 12 సిరీస్లో చౌకయిన ఫోన్ ఐఫోన్ 12 మిని. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 64GB ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్టులో రూ. 59,990 గా ఉంది. అంటే ఇది కొంచెం కాస్ట్‌లీ డీలే అన్నమాట.
Also Read : 5G smartphones: దేశంలో ఇక 5G సేవలు.. చీప్ అండ్ బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్స్ ఇదిగో
Also Read : ZEEL MD & CEO Punit Goenka: ఇండియాలో ఫస్ట్ శాటిలైట్ టీవీ మాదే.. రాబోయే 30 ఏళ్లు కూడా మావే: పునిత్ గోయెంక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి