iPhone 14: గత కొన్నాళ్లుగా స్మార్ట్​ఫోన్​ ప్రపంచంలో మెగాపిక్సెల్ వార్​ నడుస్తోంది. అయితే ఈ రేసులో మొదటి నుంచి దూరంగా ఉంటూ వచ్చిన సంస్థ ఏదైనా ఉంది అంటే.. అది ఒక్క యాపిల్ మాత్రమే. కెమెరాల సంఖ్యను ఒకటి నుంచి రెండుకు, ఆ తర్వాత మూడుకు పెంచింది కానీ.. మెగా పిక్సెళ్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 12 మెగా పిక్సెళ్లకే పరిమితమైంది. అయినా ఇతర ఫోన్లలో భారీ మెగా పిక్సెల్ ఫోన్లతో పోలిస్తే.. ఐఫోన్​లో 12 ఎంపీ కెమెరాతో కూడా ఫొటోలు అద్భుతంగా వస్తాయని యాపిల్ వాదన.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా యాపిల్​ కూడా మెగా పిక్సెల్​ పెంచేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఐఫోన్​ సిరీస్​లో 48 ఎంపీ కెమెరా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్​ ట్రిపిల్ రియర్​ కెమెరా సెటప్​తో వస్తుందని అంచనాలు ఉన్నాయి. అందులో మెయిన్​ కెమెరా 48 మెగా పిక్సెల్​తో.. అల్ట్రావైడ్​, టెలిఫోటో లెన్స్ 12 ఎంపీతో ఉండనున్నట్లు టెక్ వర్గాల్లో చర్చ సాగుతోంది.


ఇక ఐఫోన్​ 14కి సంబందించిన మిగతా అంచనాలు ఇలా..


ఐఫోన్ 14 మోడల్.. 8జీబీ ర్యామ్ వేరియంట్​లో కూడ లభ్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది. గత ఏడాది వచ్చిన ఐఫోన్ 13 ప్రోలో 6జీబీ ర్యామ్ ఉండటం గమనార్హం. ఇక దీనితో పాటు.. ఐఫోన్​ 14లో 64 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ను కూడా తేనుందట యాపిల్​.


6.1 ఓఎల్​ఈడీ డిస్​ప్లే, 128జీబీ, 256 జీబీ, 512 జీబీ, 1టీబీ వేరియంట్​లలో ఐఫోన్​ 14 లభ్యమవ్వచ్చని సమాచారం. ఇందులో ఏ16 బయోనిక్​ చిప్​సెట్​ ఉండొచ్చని టాక్​.


మరి నిజంగానే ఈ ఐఫోన్ 14లో 48 ఎంపీ కెమెరా, భారీ డిస్​ప్లే, 8జీబీ ర్యామ్​ ఉంటాయా అనే విషయం తెలియాలంటే.. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.


Also read: Whats App New Feature: గుడ్ న్యూస్.. ఫైల్స్ షేరింగ్ లిమిట్ పెంచనున్న వాట్సాప్


Also read: Nationwide strike: దేశవ్యాప్తంగా బంద్ కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook