Jio Cricket Recharge Plans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17 మార్చ్ 22 నుంచి మొదలవబోతోంది. దాదాపు రెండు నెలలు జరగనున్న ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు వీక్షించేందుకు క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 2024 ను దృష్టిలో ఉంచుకుని టెలీకం కంపెనీలు కూడా వివిధ రకాల డేటా ప్యాక్స్ విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా రిలయన్స్ జియో సైతం రెండు ప్లాన్స్ అందిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2024 సీజన్ 17 మ్యాచ్‌లను ఈసారి జియో సినిమాలో చూడవచ్చు. ఇది పూర్తిగా ఉచితమే. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ చెల్లించాల్సిన అవసరం లేదు. జియో సీమ్ కార్డు వినియోగదారులకు జియో సినిమా ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. మీక్కావల్సిందల్లా ఇంటర్నెట్ డేటా అవసరమౌతుంది. ఈ డేటా కోసమే రిలయన్స్ జియో రెండు ప్లాన్స్ అందిస్తోంది. ఈ ప్లాన్స్ మీకు ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు సరిగ్గా సరిపోవచ్చు. ఈ ప్లాన్స్‌లో ఒకటి 667 రూపాయలైతే, రెండవది 444 రూపాయలు. 


రిలయన్స్ జియో 667 ప్లాన్. ఈ ప్లాన్ 90 రోజుల కాల వ్యవధితో వచ్చే డేటా వోచర్ మాత్రమే. ఇందులో ఉచిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలుండవు. ఉచిత కాల్స్ కోసం యాక్టివ్ బేసిక్ ప్లాన్ ఉంటేనే 667 రీఛార్జ్ సాధ్యమౌతుంది. మొత్తం 90 రోజులకు కలిపి 150 జీబీ డేటా లభిస్తుంది. రోజువారీ పరిమితి ఉండకపోవడంతో ఎలాంటి అంతరాయం లేకుండా ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు వీక్షించవచ్చు.


రిలయన్స్ జియో 444 ప్లాన్. ఇది కూడా కేవలం డేటా ప్లాన్ మాత్రమే. వ్యాలిడిటీ 60 రోజులుంటుంది. ఈ ప్లాన్‌లో కూడా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలుండవు. బేసిక్ ప్లాన్ ఉంటేనే రీఛార్జ్ అవుతుంది. ఈ ప్లాన్‌లో 60 రోజులకు కలిపి 100 జీబీ డేటా ఉంటుంది. ఐపీఎల్ 2024 సీజన్ 17 మ్యాచ్‌లు వీక్షించేందుకు ఇవే బెస్ట్ డేటా ప్లాన్స్. 


Also read: YS Sharmila: కడప బరిలో వైఎస్ షర్మిల, అన్నాచెల్లెళ్ల మధ్య పోటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook