IRCTC New Rules: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఐఆర్‌సీటీసీ రీఫండ్ గంటలోనే..
IRCTC Refund Rules: ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసే సమయంలో డబ్బుల్ కట్ అయినా.. టికెట్ బుక్ అవ్వదు. ఆ డబ్బులు తిరిగి మన అకౌంట్‌కు రావాలంటే రోజుల సమయంలో పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఐఆర్‌సీటీసీ చర్యలు చేపట్టింది.
IRCTC Refund Rules: మనం రైలు ప్రయాణం కోసం ఎక్కువగా ఐఆర్‌సీటీసీలో బుక్ చేసుకుంటాం. సర్వర్ బిజీగా ఉన్నప్పుడు ఒక్కోసారి టికెట్ బుక్ అవ్వకపోయినా మన అకౌంట్‌లో మాత్రం డబ్బులు కట్ అవుతుంటాయి. డబ్బులు డెబిట్ అవ్వడంతో మనకు టికెట్ బుక్ అవుతుందని అనుకుంటాం. కానీ అటు బుక్ అవ్వక.. ఇటు డబ్బులు కట్ అయిపోవడంతో నిరాశకు గురవుతాం. కట్ అయిన డబ్బులను ఐఆర్‌సీటీసీ రీఫండ్ చేస్తుంది. కానీ ఈ ప్రాసెస్ పూర్తవ్వడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. కనీసం 2 లేదా 3 టైమ్ పడుతుంది. తరచు రైలు ప్రయణాలు చేసే వారికి టికెట్ బుకింగ్ చేసే సమయంలో ఇలాంటి సమస్య ఎదురవుతోంది. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఐఆర్‌సీటీసీ రెడీ అవుతోంది. కట్ అయిన డబ్బులను సాధ్యమైనంత తక్కువ సమయంలోనే రీఫండ్ చేయనుంది. గంట లేదా కొన్ని గంటల్లో అకౌంట్‌లో జమ అయ్యే విధంగా చర్చలు తీసుకోనుందని సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన సర్వీస్‌ను ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read: BRS Party: బీఆర్‌ఎస్ పార్టీ సంచలనం.. వారిని కాదని వీరికి నాలుగు టికెట్లు కేటాయింపు మరి గెలుస్తారా?
ప్రస్తుతం రీఫండ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండడంతో యూజర్ల నుంచి ఫిర్యాదు ఎక్కువగా అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సర్వీస్ రైల్వే అథారిటీ ఈ వ్యవస్థను మార్చే పనిలో ఉంది. IACTC, సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బృందం రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉండి కన్ఫర్మ్ కాకపోతే.. ఆటోమేటిక్‌గా రీఫండ్ డబ్బు వస్తుంది. అదే సమయంలో కన్ఫర్మ్ అయిన టికెట్‌ను క్యాన్సిల్ చేస్తే.. క్యాన్సిల్ ఛార్జీని వసూలు చేస్తుంది. ఇది టికెట్ క్లాస్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే రైలు వెళ్లిపోయి.. మీరు ప్రయాణించకపోతే రీఫండ్ కోసం టీడీఆర్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. టీడీఆర్ ఫైల్ చేసిన తర్వాత వెరిఫికేషన్ పూర్తి చేసి.. రైల్వే శాఖ రిఫండ్ ఇస్తుంది. రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు టిక్కెట్‌ను క్యాన్సిల్ చేయకపోయినా లేదా టీడీఆర్ ఫైల్ చేయకపోయినా.. డబ్బులు రీఫండ్ అవ్వవు.
ఐఆర్‌సీటీసీ నుంచి రీఫండ్ కావాలనుకుంటే రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు టిక్కెట్‌ను క్యాన్సిల్ చేసి.. టీడీఆర్ ఫైల్ చేయాలి. ఇలా చేయకపోతే డబ్బులు రీఫండ్ అవ్వవు. ఇప్పుడు ఈ కొత్త సర్వీస్ అమల్లోకి వస్తే లక్షలాది మంది తమ అకౌంట్‌లోకి వీలైనంత త్వరగా డబ్బులు చేరే అవకాశం ఉంది. అన్ని ప్రక్రియలు ఆటోమేటిక్‌గా జరుగుతున్నప్పుడు డబ్బులు రీఫండ్ చేయడానికి ఎందుకు ఆలస్యం అవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతుండడంతో రీఫండ్లపై ఐఆర్‌సీటీసీ పూర్తిస్థాయిలో దృష్టిసారించింది.
Also Read: IPL 2024 Updates: కప్ కొట్టాలనే కసితో ఆర్‌సీబీ.. కొత్త స్క్వాడ్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter