IRCTC Package: ఐఆర్ సీటీసీ ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. దుబాయ్ వంటి దేశాల్ని చుట్టి వచ్చేందుకు ఇది అద్భుతమైన ప్యాకేజ్. అందుకే డేజ్లింగ్ దుబాయ్ ప్యాకేజ్ ఎక్స్‌ఢిల్లీ అందిస్తోంది. ఈ ప్యాకేజ్‌లో దుబాయ్‌తో పాటు ఎక్కడెక్కడికి వెళ్లవచ్చు, ఎంత ఖర్చవుతుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఆర్సీటీసీ అందిస్తున్న డేజ్లింగ్ దుబాయ్ ప్యాకేజ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ ప్యాకేజ్ 6 రోజులు, 5 రాత్రులు 3 స్టార్ హోటల్ స్టే కలిగి ఉంటుంది. దీంతోపాటు భోజనం, ట్రాన్స్‌పోర్టేషన్, దుబాయ్‌లోని ముఖ్యమైన ప్రదేశాలు చుట్టి వచ్చేలా ఉంటుంది. ఈ టూర్ ఒక్కొక్కరికి 94,400 రూపాయలు ఖర్చు అవుతుంది. 


అదే థాయ్‌లాండ్ చూడాలనే ఆసక్తి ఉంటే ట్రెజర్స్ ఆఫ్ థాయ్‌లాండ్ ఎక్స్ ముంబై ప్యాకేజ్ కొత్త ఏడాదిలో జనవరి 10 నుంచి జనవరి 14 వరకూ అందుబాటులో ఉంటుంది. ఇందులో ముంబై నుంచి బ్యాంకాక్, పట్టాయా టూర్, ఫ్లైట్ టికెట్స్, హోటల్ స్టే, భోజన సౌకర్యం, వీసా సౌకర్యం ఉంటాయి. ఈ ప్యాకేజ్‌లో పట్టాయా, బ్యాంకాక్ అందాలు చూడవచ్చు.


ఇక నేపాల్ తిరగాలని ఆసక్తి ఉంటే మిస్టికల్ నేపాల్ ఎక్స్ ముంబై పేరుతో మరో ప్యాకేజ్ అందిస్తోంది ఐఆర్సీటీసీ. ఈ టూర్ ప్యాకేజ్ జనవరి 9, ఫిబ్రవరి 12, మార్చ్ 4న ప్రారంభమౌతుంది. ఇందులో పశుపతినాథ్ టెంపుల్, దర్బార్ స్క్వేర్, పోఖ్రాలోని మనోకామ్నా ఆలయం,  వింధ్యావాసిని ఆలయం, గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ చూడవచ్చు ఈ ప్యాకేజ్‌లో వసతి, భోజనం, ఫ్లైట్ టికెట్స్ కలిపి ఉంటాయి. ఒక్కొక్కరికి 44,100 రూపాయలు ఖర్చవుతుంది. 


Also read: AP Government: ఏపీలో మహిళలకు సంక్రాంతి కానుక, తెలంగాణ తరహా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook