LIC Policy and Pancard: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దేశంలో అతిపెద్ద జీవిత భీమా సంస్థగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద భీమా కంపెనీగా ఉన్న ఎల్ఐసీ త్వరలో ఐపీవో విడుదల కానుంది. మరి మీ పాన్ నెంబర్ ...పాలసీతో లింక్ అయిందా లేదా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో అతిపెద్ద జీవిత భీమా కంపెనీగా ఉన్న ఎల్ఐసీ ఐపీవో విడుదలకు సన్నాహాలు పూర్తవుతున్నాయి. మార్చ్ నెలలో ఎల్ఐసీ ఐపీవో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఒక్కొక్క షేర్ విలువ 2 వేల రూపాయలుండవచ్చని తెలుస్తోంది. ఎల్ఐసీ పాలసీదారులకు ఈ ఐపీవోలో పది శాతం రిజర్వేషన్‌తో పాటు పది శాతం డిస్కౌంట్ కూడా వర్తించనుంది. దేశంలో ప్రస్తుతం ఎల్ఐసీ పాలసీదారులు 25 కోట్లమంది వరకూ ఉన్నారు. ఇప్పుడు ఎల్ఐసీ పాలసీదారులకు ఐపీవోలో రిజర్వేషన్ ద్వారా మార్చ్ నాటికి దేశంలో కొత్తగా కోటిమంది డీమ్యాట్ ఎక్కౌంట్లు తెరిచే అవకాశాలున్నాయి. స్టాక్ మార్కెట్‌కు ఇది కచ్చితంగా అతి పెద్ద బ్రేకింగ్ న్యూస్ కానుంది. అటు ఎల్ఐసీ పాలసీదారుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఎల్ఐసీ పాలసీదారులకు ..ఐపీవో రిజర్వేషన్ వర్తించాలంటే తప్పనిసరిగా చేయాల్సిన పని ఒకటుంది.


పాన్ నెంబర్ - ఎల్ఐసీ పాలసీ అనుసంధానం


ఇప్పటి వరకూ ఆధార్ కార్డు - పాన్ నెంబర్ లింకేజ్ గురించే మీకు తెలుసు. ఇక ఇప్పుడు తెలుసుకోవల్సింది ఎల్ఐసీ పాలసీతో పాన్ నెంబర్ అనుసంధాన ప్రక్రియ. ఎందుకంటే ఎల్ఐసీ పాలసీదారుడైనంత మాత్రాన మీకు ఎల్ఐసీ ఐపీవోలో రిజర్వేషన్ దక్కదు. ఎల్ఐసీ ఐపీవోలో షేర్ దక్కించుకోవాలంటే తప్పనిసరిగా మీ పాన్ నెంబర్‌ను మీ పాలసీతో లింక్ చేసుకోవడం తప్పనిసరి. దాంతో పాటు డీమ్యాట్ ఎక్కౌంట్ లేకపోతే తెర్చుకోవాలి. ఎల్ఐసీ పాలసీతో మీ పాన్ నెంబర్ లింక్ చేసుకునేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువుంది. ఫిబ్రవరి 28 అంటే ఈ నెలాఖరులోగా మీ పాన్ నెంబర్ లింక్ చేసుకోవల్సి ఉంటుంది. అత్యంత సులభంగా ఇంట్లో కూర్చుని మీ పాన్ నెంబర్‌ను..మీ పాలసీతో లింక్ చేసుకోవచ్చు. అదెలాగంటే...


ముందుగా ఎల్ఐసీ జారీ చేసిన ఈ లింక్ https://linkpan.licindia.in/UIDSeedingWebApp/ ఓపెన్ చేయాలి. మీ ముందు ఓపెన్ అయిన ఫారమ్‌లో మీ పుట్టిన తేదీ వివరాలు, పాన్ కార్డులో ఉన్నట్టుగా పేరు, ఈమెయిల్, మొబైల్ నెంబర్, పాలసీ నెంబర్ వివరాలు నమోదు చేసిన తరువాత అక్కడున్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే..మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే..చాలు. మీ పాన్ నెంబర్..మీ పాలసీతో లింక్ అయిపోయినట్టే. కేవలం 2 నిమిషాల్లో ఆ ప్రక్రియ పూర్తయిపోతుంది. 


Also read: Todays Gold Rate: ఇవాళ ఫిబ్రవరి 24, 2022 బంగారం ధరలు ఇలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook