PSLV C53 Launch: ఇస్రో మరో ఘనత సాధించింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ నుంచి మరో వాణిజ్యపరమైన మిషన్ విజయవంతంగా ప్రయోగించింది. పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం వివరాలు ఇలా ఉన్నాయి.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవిభక్త నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ మరో ఘనత సాధించింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రెండవ వాణిజ్యపరమైన మిషన్ విజయవంతమైంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ స్థాపన తరువాత రెండవ మిషన్ ఇది. ఇవాళ అంటే జూన్ 30వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ53 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. 


ఇవాళ ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ53 ద్వారా సింగపూర్, కొరియాలకు చెందిన మూడు ఉపగ్రహాల్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. డీఎస్-ఈవో ఉపగ్రహం బరువు 365 కిలోలు కాగా..0.5 మీటర్ల రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్ధ్యంతో ఎలక్ట్రో ఆప్టిక్, మల్టీ స్పెక్ట్రల్ పేలోడ్ మోసుకెళ్లింది. ఎన్ఇయూఎస్ఏఆర్ సింగపూర్‌కు చెందిన పేలోడే మోసుకెళ్లే మినీ కమర్షియల్ శాటిలైట్. పీఎస్ఎల్వీ సీ 53 అనేది పీఎస్ఎల్వీ సిరీస్‌లో 55వ ప్రయోగంగా ఉంది. 26 గంటల కౌంట్‌డౌన్ అనంతరం రాకెట్ ప్రయోగించారు. 


Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త, డీఏ 6 శాతం పెంపు, 40 వేల జీతం పెరుగుదల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook