7th Pay Commission: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త, డీఏ 6 శాతం పెంపు, 40 వేల జీతం పెరుగుదల

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరవు భత్యం జూలై 1 అంటే రేపట్నించి పెరగనుంది. ఏఐసీపీఐ తాజా గణాంకాలతో డీఏ 6 శాతం పెరగనుందని దాదాపుగా ఖరారైంది. అంటే జీతభత్యాలు ఏకంగా 40 వేల వరకూ పెరగనున్నాయి. ఆ వివరాలు ఇవీ..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 30, 2022, 08:22 PM IST
 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త, డీఏ 6 శాతం పెంపు, 40 వేల జీతం పెరుగుదల

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరవు భత్యం జూలై 1 అంటే రేపట్నించి పెరగనుంది. ఏఐసీపీఐ తాజా గణాంకాలతో డీఏ 6 శాతం పెరగనుందని దాదాపుగా ఖరారైంది. అంటే జీతభత్యాలు ఏకంగా 40 వేల వరకూ పెరగనున్నాయి. ఆ వివరాలు ఇవీ..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త ఇది. జూలై నెల జీతం భారీగా పెరగబోతోంది. డీఏ 6 శాతం పెరగడంతో పాటు పీఎఫ్, గ్రాట్యుటీ కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 34 శాతం ఉంది. డీఏ ఇప్పుడు 6 శాతం పెరిగితే 40 శాతానికి చేరుకుంటుంది. దీంతోపాటు ట్రావెల్ అలవెన్స్, సిటీ అలవెన్స్ కూడా పెరగబోతున్నాయి. అటు ప్రోవిడెంట్ ఫండ్, గ్రాట్యుటీలో కూడా పెరుగుదల కన్పించనుంది. అంటే మొత్తం జీతంలో 40 వేల వరకూ పెంపు కన్పిస్తుంది. 

పెరగనున్న పీఎఫ్, గ్రాట్యుటీ, టీఏ

జీ బిజినెస్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నెలవారీ పీఎఫ్, గ్రాట్యుటీ అనేది బేసిక్ శాలరీ, డీఏపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు డీఏ పెరగడంతో సహజంగానే పీఎఫ్, గ్రాట్యుటీలు పెరగనున్నాయి. గత ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏలో 17 శాతం పెరుగుదల వచ్చింది. 2021 జూన్ నుంచి ఇప్పటివరకూ డీఏ 17 శాతం నుంచి 34 శాతానికి చేరుకుంది. ఫలితంగా ఈపీఎఫ్, గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతోంది. డీఏ ఎప్పుడైతే పెరిగిందో ఆ ప్రభావం టీఏపై పడుతుంది. డీఏ 40 శాతమైనప్పుడు టీఏ కూడా పెరగవల్సిందే. 

ఏఐసీపీఐ తాజా గణాంకాల ప్రకారం డీఏ 5 శాతం పెరగవచ్చని దాదాపుగా ఖరారైంది. మే నెల గణాంకాల్లో ఇది కన్పిస్తోంది. ఇది కాకుండా ఏడాదిన్నర అంటే 18 నెలల నుంచి పెండింగులో ఉన్న డీఏ ఎరియర్‌పై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల పెండింగ్ డీఏ ఎరియర్స్ విషయంలో ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. 

ఉద్యోగి కనీస వేతనం                                 56,900 రూపాయలు
కొత్త కరవు భత్యం 40 శాతం                        22,760 రూపాయలు
ప్రస్తుత కరవు భత్యం 34 శాతం                  19,346 రూపాయలు
పెరిగిన కరవు భత్యం                                 నెలకు 3, 414 రూపాయలు
ఏడాదికి పెరిగిన డీఏ                                 40, 968 రూపాయలు

ఉద్యోగి కనీస జీతం                                     18,000 రూపాయలు
కొత్త కరవు భత్యం 40 శాతం                           7,200 రూపాయలు నెలకు
ప్రస్తుత కరవు భత్యం 34 శాతం                      6,120 రూపాయలు నెలకు
పెరిగిన కరవు భత్యం                                   1080 రూపాయలు నెలకు
ఏడాదికి పెరిగిన మొత్తం                              12,960 రూపాయలు నెలకు

Also read: Bank Holidays July: జూలై నెలలో బ్యాంక్ పనులుంటే సమస్యే..16 రోజులు సెలవులు, ఇదే సెలవుల జాబితా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News