Carona కరోనా ప్రపంచానికి కొత్త కష్టాలు తెచ్చింది. జీవన శైలిలో మార్పులు తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి మానవాళిని ముప్పు తిప్పులు పెట్టిన కరోనా... ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఎన్నో వ్యాపారుల వీధిన పడ్డాయి. ఎంతో మంది దివాళా తీశారు. అయితే కరోనా కొందరిని ముప్పు తిప్పలు పెడితే మరికొంత మందికి అవకాశాలు సృష్టించింది.అయితే మొత్తానికి మిగత సంస్థల ఉద్యోగుల కంటే ఐటీ రంగం  ఉద్యోగులు మాత్రం కరోనా టైంను బాగా ఎంజాయ్ చేశారు. వర్క్ ఫ్రం హోంను తెగ ఎంజాయ్ చేశారు. ఇంటి పట్టునే ఉంటూ పనులు చక్కబెట్టుకుంటూ పని చేసుకుంటూ తెగ సంపాదించేశారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆఫీసులకు రావాలంటే ఉద్యోగులకు మనస్సు ఒప్పడం లేదు. ఇంటి పట్టునే ఉండి పనిచేసుకుంటామని యాజమాన్యాలను బెదిరిస్తున్నారు. దీంతో గట్టిగా ఒత్తిడి చేయలేని స్థితికి యాజమాన్యాలు చేరుకున్నాయి. గ్రేట్ రిజిగ్నేషన్‌తో పాటు అట్రిషన్‌ రేటు ఐటీ సంస్థలను తెగ కలవర పెడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్‌లో కూడా అట్రిషన్ రేటు కలవపెడుతోంది. చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రాజీనామాలు సిద్ధం అవుతున్నారు. వర్క్ ఫ్రం హోం చేస్తామే కాని బ్యాక్‌ టు ఆఫీస్ సాధ్యం కాదని చెబుతున్నారు. అయితే దీనికి విరుగుడగా సాఫ్ట్ వేర్ కంపెనీలు సరికొత్త ప్లాన్ వేశాయి. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో చాలా మంది పెళ్లి కాని ప్రసాద్‌లో ఉండడంతో తమ దగ్గర పని చేస్తే ఉచితంగా పెళ్లి సంబంధాలు చూస్తామని ఆఫర్ ఇస్తున్నారు. అవసరంగా మ్యారేజ్ బ్యూరోలకు డబ్బులు కట్టే బదులు తమ దగ్గర బుద్ధిగా పనిచేసుకుంటే చాలు పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత తమదే అని హామీ ఇస్తున్నారు. పెళ్లి అయిన వాళ్లకు ఇంక్రిమెంట్లు ఇస్తామని అంటున్నారు. ఉద్యోగుల పర్ఫామెన్స్ పట్టి ప్రమోషన్లు కూడా ఇస్తామని హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా మదురైలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ తన ఉద్యోగులకు ఈ ఆఫర్ చేసింది. దీంతో చాలా మంది సంస్థ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఎస్‌ఎంఐ సంస్థను 2006లో శివకాశిలో  ప్రారంభించారు. ఆతర్వాత 2010 మధురైకి సంస్థ కార్యాలాయాన్ని మార్చారు. ఈసంస్థలో సుమారు 750 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల విజృంభించి పనిచేయడంతో సంస్థ ఆదాయం వంద కోట్లు దాటింది. అయితే కరోనా కారణంగా వచ్చిన మార్పులతో ఉద్యోగుల మనసు మారింది. ఉద్యోగుల మనసు మారకుండా మళ్లీ వాళ్లను గాడిలో పెట్టి సంస్థను పరుగులు పెట్టించాలని యాజమాన్యం భావిస్తోంది. అందుకే బంపర్ ఆఫర్లు ఇస్తోంది. ఈ ఆఫర్లపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎక్కువ పని చేసి సంస్థకు ఇంకా ఎక్కువ లాభాలు తీసుకొస్తామని అంటున్నారు.a


also read  అమెరికాలో అత్యంత గరిష్ట స్థాయికి వడ్డీ రేటు.... ఆటో రుణాలు, క్రెడిట్ కార్డులపై భారీగా ఛార్జీలు


also read యాపిల్ సంస్థ యాజమాన్యానికి ఉద్యోగులకు మధ్య సంఘర్షణ ... కొత్ ప్లాన్ వేస్తున్న యాజమాన్యం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe