America federal reserve bank కఠినతరమైన తన మానిటరీ పాలసీ విధానాన్ని అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు ప్రకటించింది. 50 బేసిస్ పాయింట్ల తన బెంచ్ మార్కు లెండింగ్ రేటును పెంచేసింది. 20 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత గరిష్ట స్థాయి అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫెడరల్ రిజర్వు బ్యాంకు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదంతో ఫెడరల్ ఫండ్స్ రేటును 0.75 శాతం నుంచి 1 శాతం మధ్యలో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. మరో అత్యధిక రేటు పెంపును మున్ముందు రానున్న రోజుల్లో చూడొచ్చని అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు ఉన్నతోద్యోగి ఫెడ్ వ్యాఖ్యానించారు. ఈ తప్పనిసరి పరిస్థితుల వల్ల వడ్డీ రేట్లు రాబోయే రోజులలో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో 75 బేసిస్ పాయింట్ల వరకు పాలసీ పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇంత కఠినతరమైన స్థాయిలో రేట్ల పెంపు 2000 తర్వాత చేపట్టడం ఇదే తొలిసారి. తన బ్యాలెన్స్ షీటును తగ్గించుకోవడం ప్రారంభమైందని ఫెడ్ ప్రకటించారు. దీంతో 9 ట్రిలియన్ డాలర్లు తగ్గిందని చెప్పారు. ముఖ్యంగా ట్రెజరీ, మోర్టగేజ్ బాండ్లు బ్యాలెన్స్ షీట్లు తగ్గాయన చెప్పారు. ఈ హోల్డింగ్స్‌ను రెండింతలు పెంచడం కరోనా మహమ్మారి తర్వాతి ఇదే మొదటి సారి. దీంతో ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు మరింత పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఫెడ్ తన క్రెడిట్ పాలసీని కఠినతరం చేయడంతో.. ఇకపై వ్యాపారస్తులకు, వినియోగదారులకు వడ్డీ రేట్లు పెరగనున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ముఖ్యంగా ఆటో లోన్ల రేట్లు, క్రెడిట్ కార్డు లోన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కన్జూమర్ గూడ్స్, విద్యుత్, ఆహారం ధరలు భారీగా పెరగడంతో.. వీటి రేట్లను అదుపులోకి తీసుకురావాలని ఫెడ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రజల బారోయింగ్ కాస్ట్‌లను పెంచడం వల్ల ప్రజలు ఇష్టారాజ్యంగా పెడుతున్న ఖర్చులను తగ్గించవచ్చని ఫెడ్ భావిస్తున్నట్లు సమాచారం. అమలులోకి వస్తూ రాగానే ఫెడ్ క్రెడిట్ పాలసీ అప్పుడే పనిచేయడం ప్రారంభమైంది. మోర్టగేజ్ రేట్లు పెరిగిపోయాయి. ఇళ్ల అమ్మకాలు 2.7 శాతం తగ్గాయి.
మోర్టగేజ్ కనీస రేటు 30 ఏళ్ల ఈ ఏడాది ప్రారంభం నుంచి 2 శాతం పెరిగినట్లు సమాచారం.
also read యాపిల్ సంస్థ యాజమాన్యానికి ఉద్యోగులకు మధ్య సంఘర్షణ ... కొత్ ప్లాన్ వేస్తున్న యాజమాన్యం
also read Airtel OTT Plans: భారతీ ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్.. ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ సదుపాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe