యాపిల్ సంస్థ యాజమాన్యానికి ఉద్యోగులకు మధ్య సంఘర్షణ ... కొత్ ప్లాన్ వేస్తున్న యాజమాన్యం

యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ తీసుకొచ్చిన కొత్తపాలసీని పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వ్యతిరేకించారు. ఏకంగా  75శాతం మంది ఉద్యోగులు సీఈఓ నిర్ణయాన్ని వ్యతిరేకించారని సమాచారం.

Edited by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 03:29 PM IST
  • ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ భారీ షాక్
  • వారానికి 3 రోజులు ఆఫీస్‌ రావాలని ఉద్యోగులకు మెయిల్స్‌
  • ఎక్కడి నుంచి చేస్తే ఏంటని తిరిగి యాజమాన్యాన్నే ప్రశ్నిస్తున్న ఉద్యోగులు
యాపిల్ సంస్థ యాజమాన్యానికి ఉద్యోగులకు మధ్య సంఘర్షణ ... కొత్ ప్లాన్ వేస్తున్న యాజమాన్యం

Apple companyతన సంస్థ ఉద్యోగులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ భారీ షాక్ ఇచ్చింది. యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ తీసుకొచ్చిన కొత్తపాలసీని పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వ్యతిరేకించారు. ఏకంగా  75శాతం మంది ఉద్యోగులు సీఈఓ నిర్ణయాన్ని వ్యతిరేకించారని సమాచారం. దీంతో ఇంత కాలం సంస్థ ఉద్యోగుల కష్టంతో యాపిల్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంస్థ సీఈఓకు ఈ వ్యవహారం ఇబ్బంది కరంగా మారింది.

కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం ఆఫర్ ఇచ్చింది యాపిల్ కంపెనీ. రెండేళ్ల పాటు ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోంకు బాగా అలవాటు పడ్డారు. అయితే కరోనా ప్రభావం తగ్గిపోవడంతో మళ్లీ అందర్ని ఆఫీస్‌కు రమ్మంటున్నారు సీఈఓ ... అయితే ఇంటి పట్టునే ఉండి పనులు చక్కబెట్టుకోవడం బాగా అలవాటు పడ్డ ఉద్యోగులు ఈ నిర్ణయంపై  అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మిగతా కార్పోరేట్ సంస్థ ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చిన పనిచేస్తుంటే మీకేమైందని సీఈఓ ప్రశ్నిస్తున్నారు. ఈ వైఖరి తగదని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. అయితే ఉద్యోగుల మనుస మెళ్లి మెళ్లిగా మర్చాలని నిర్ణయించుకున్న సీఈఓ ముందు వారానికి 3 రోజులు ఆఫీస్‌ రావాలని  ఉద్యోగులకు మెయిల్స్‌ పంపారు.

అయితే అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన ఉద్యోగులు కావడంతో ఈ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఇలా గైతే ఉద్యోగాలకు రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
సంస్థకు కావాల్సింది పని ... అది ఎక్కడి నుంచి చేస్తే ఏంటని తిరిగి యాజమాన్యాన్నే ప్రశ్నిస్తున్నారు. రిటర్న్‌ టూ ఆఫీస్‌ పాలసీని తగదని హెచ్చరిస్తున్నారు. వర్క్ ఫ్రం హోంలో మజా ఆఫీసులో ఎక్కడ  ఉందని ప్రశ్నిస్తున్నారు. దీంతో సంస్థ ఉద్యోగులు సంస్థ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీట  వేస్తున్నారని గ్రహించిన యాపిల్ యాజమాన్యం ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. ముందు కొంత మంది ఉద్యోగులను పనిలోంచి తీసేస్తే మిగతా వాళ్లు భయపడి ఆఫీసుకు వస్తారని అంచనా వేస్తోంది. ఇక ఆర్థిక అవసరాలు ఉన్న ఉద్యోగులు అయితే చచ్చినట్లు వచ్చి పని చేస్తారని అంచనా వేస్తోంది. ముందు మంచి మాటకు సర్ధిచెప్పాలని చూస్తోంది. ఇక అప్పటికీ లాభం లేకపోతే ఉద్యోగులను తీసేసి ఫ్రెషర్స్‌ని పెట్టుకొని పని కానిచ్చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

also read Airtel OTT Plans: భారతీ ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్.. ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ సదుపాయం!

alsor read Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్వహణ మరో 30 ఏళ్లు ఆ సంస్థకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

 

Trending News