IT Returns 2023: ఫామ్ 16 లేకుండా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయగలమా, ఎలా చేయాలి, ఏం చేయాలి
IT Returns 2023: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్. ఈ నెలంతా అదే సందడి ఉంటుంది. అటు ఉద్యోగులు ఇటు ట్యాక్స్ ప్రాక్టీషనర్లకు ఇదే పని. మరో 20 రోజులే గడువు మిగిలింది. మరి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఫామ్ 16 ఉందా లేదా..లేకపోతే ఏం చేయాలి, ఎలా చేయాలో తెలుసుకుందాం..
IT Returns 2023: ట్యాక్స్ పేయర్లకు జూలై నెలంతా బిజీగా ఉండే సమయం. జూలై 31లోగా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సాధారణంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ప్రధానంగా కావల్సింది ఫామ్ 16. ఒకవేళ ఏ కారణంతోనైనా ఫామ్ 16 అందుబాటులో లేకపోతే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేమా. నిపుణులు ఏమంటున్నారు...
జూలై 31లోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. లేకపోతే డిసెంబంర్ 31 లోగా జరిమానాతో ఫైల్ చేయాల్సి వస్తుంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఫామ్ 16 తప్పనిసరిగా కావల్సి ఉంటుంది. ఫామ్ 16 అనేది ఉద్యోగం చేసే యజమాని లేదా సంస్థ జారీ చేస్తారు. ఫామ్ 16 అనేది ఐటీ రిటర్న్స్ దాఖలులో అత్యంత కీలకమైన సింగిల్ డాక్యుమెంట్. ఇదొక్కటి చాలు మిగిలినవి ఏవీ అవసరం లేదు. ఇందులోనే జీం వివరాలు, ట్యాక్స్ డిడక్షన్, పీఎఫ్, ఇతరత్రా వివరాలు అన్నీ సమగ్రంగా ఉంటాయి. ఉద్యోగం చేసే సంస్థ ఫామ్ 16 జారీ చేస్తుంది. ఏదైనా కారణంతో యజమాని లేదా సదరు సంస్థ నుంచి ఫామ్ 16 సకాలంలో రాకపోతే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేమా...అంటే కాదనే సమాధానం వస్తోంది. ఫామ్ 16 లేకుండానే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చంటున్నారు నిపుణులు.
ఫామ్ 16 లేకుండా 2023-24 అసెస్‌మెంట్ ఇయర్ ఐటీ రిటర్న్స్ ఎలా దాఖలు చేయాలో తెలుసుకుందాం..ట్యాక్స్ పరిధిలో వచ్చే ప్రతి ఒక్కరూ ప్రతి యేటా తప్పకుండా ఐటీ రిటర్న్స్‌తో పాటు అసెస్‌మెంట్ పైల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుుడీ ప్రక్రియకు గడువు తేదీ జూలై 31. గడువులోగా రిటర్న్స్ ఫైల్ చేయకుంటే పెనాల్టీతో పాటు ఇతరత్రా సమస్యలు చాలా ఉంటాయి. అందుకే ట్యాక్స్ పేయర్లు ఐటీ రిటర్న్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఫామ్ 16 ఒకవేళ లేకపోయినా శాలరీ స్లిప్, ఆదాయ లెక్కింపు, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఫామ్ 26ఏఎస్, ఐటీఆర్ ఇ వెరిఫికేషన్ ప్రక్రియలతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.
శాలరీ స్లిప్ విషయంలో ఆ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన శాలరీ స్లిప్‌లు అన్నీ సేకరించాలి. ఇందులోనే అలవెన్సులు, డిడక్షన్లు, ఇతర ఆదాయ వివరాలుంటాయి. ఇందులో ఉండే బేసిక్ శాలరీ, అలవెన్సులు, బోనస్ అన్నీ పరిగణలో తీసుకుని ట్యాక్సెబుల్ ఇన్‌కం ఎంతనేది లెక్కించాల్సి ఉంటుంది. ఇందులో హౌస్ రెంట్ అలవెన్స్, స్టాండర్డ్ డిడక్షన్, ప్రొఫెషనల్ ట్యాక్స్, పీఎఫ్ వంటివి తీసేయాలి. వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం, డివిడెండ్2లు ఇతర ఆదాయాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేది బ్యాంక్ స్టేట్‌మెంట్లను బట్టి తెలుస్తుంది. ఇన్‌కంటాక్స్ వెబ్‌సైట్ ద్వారా లభించే ఫామ్ 26ఏఎస్ కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు అవసరమౌతుంది. ఇందులో ఉదహరించిన టీడీఎస్ వివరాలు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది.
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తరువాత ఇ వెరిఫికేషన్ చాలా కీలకమైంది. ఇ వెరిఫికేషన్ లేకుండా ఐటీఆర్ అనేది అసంపూర్తి ప్రక్రియ.
Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook