ITR Filing Last Date Today: ఐటీఆర్ ఫైల్ చేయడానికి మరికొన్ని గంటల మాత్రమే సమయం ఉంది. నేటితో గడువు ముగియనుండగా.. ప్రభుత్వం ఐటీఆర్‌ దాఖలుకు గడువును పొడిగించలేదు. ఈ రోజు రిటర్న్ ఫైల్ చేయలేకపోతే.. జరిమానాతో చెల్లించడంతోపాటు.. నోటీసులు కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ట్యాక్స్‌ పేయర్లపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూలై 30 వరకు 6 కోట్ల మందికి పైగా ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 1.30 కోట్ల మందికిపైగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయినట్లు సమాచారం అందించింది. ఆదివారం ఒక్కరోజే 27 లక్షలకు పైగా రిటర్నులు దాఖలైనట్లు తెలిపింది. ఇప్పటికే గతేడాదిని మించి రికార్డుస్థాయిలో ఐటీఆర్ ఫైలింగ్‌ జరిగినట్లు పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AY 2023-24 కోసం ఐటీఆర్ ఫైల్ చేయని వారు.. చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి త్వరగా దాఖలు చేయాలని ఐటీ శాఖ కోరుతోంది. ఐటీఆర్ ఫైలింగ్, పన్ను చెల్లింపు, ఇతర సంబంధిత సేవల కోసం ట్యాక్స్ పేయర్లకు సహాయం చేయడానికి హెల్ప్‌డెస్క్ 24×7 ప్రాతిపదికన పని చేస్తుందని తెలిపింది. కాల్‌లు, లైవ్ చాట్‌లు, WebEx సెషన్‌లు, సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ అందిస్తున్నామని వెల్లడించింది. ఐటీఆర్ దాఖలు చేయడానికి ఈరోజు చివరి రోజు కావడంతో చివరి నిమిషంలో ఎలాంటి పొరపాటు చేయకూడదని గుర్తుంచుకోండి. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు ఈ తప్పులను నివారించాలి.


==> ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో సరైన అసెస్‌మెంట్ సంవత్సరాన్ని పేర్కొనడం తప్పనిసరి. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తప్పు సంవత్సరం ఎంచుకుంటే.. డబుల్ ట్యాక్సేషన్‌పాటు పెనాల్టీల అవకాశాన్ని పెంచుతుంది.
==> వివిధ రకాల పన్ను చెల్లింపుదారుల కోసం వేర్వేరు ఫారమ్‌లు ఉన్నాయి. సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవడం కూడా ముఖ్యం. తప్పు ఫారమ్‌ను ఎంచుకోవడం లోపభూయిష్టంగా మారుతుంది. మరోసారి రిటర్న్‌ను ఫైల్ చేయమని నోటీసులు వచ్చే అవకాశం ఉంది.
==> జీతం, వడ్డీ లేదా స్థిరాస్తి అమ్మకం వంటి ఆదాయంపై పన్ను చెల్లింపులను ఫారమ్ 26AS TDS కలిగి ఉంటుంది. ఎవరైనా ఫారమ్ 26ASతో ఫైల్ చేసేవాళ్లు టీడీఎస్, పన్ను చెల్లింపులను క్రాస్ చెక్ చేసుకోవాలి.
==> పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్‌ను క్రెడిట్ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను కరెక్ట్‌గా ఎంచుకోవాలి
==> ఐటీఆర్ ఫారమ్‌లు అనేక అడ్డు వరుసలు, నిలువు వరుసలతో ఉంటుంది. సరైన వివరాలను నిర్దిష్ట ప్రదేశంలో పూరించాల్సి ఉంటుంది.


Also Read: JC Prabhakar Reddy: ఆ రోజు ఉరి వేసుకుందామనుకున్నా.. సంచలన విషయాలు బయటపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి  


Also Read: Weather Updates Today: రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి