ITR Refund Status: ట్యాక్స్ రీఫండ్ క్రెడిట్ అవ్వలేదా..? ఇలా చెక్ చేయండి
Status of Tax Refund: ఐటీఆర్ ఫైల్ చేసినా.. ఇంకా చాలామంది ఖాతాల్లో ట్యాక్స్ రీఫండ్ క్రెడిట్ కాలేదు. ఐటీఆర్ ఫైలింగ్ గడువు జూలై 31వ తేదీతోనే ముగిసిపోగా.. రీఫండ్ కోసం కొంతమంది పన్ను చెల్లింపుదారులు ఎదురుచూస్తున్నారు.
Status of Tax Refund: 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువు ముగిసింది. జూలై 31నే ఐటీఆర్ ఫైలింగ్‌కు చివరి తేదీ. షెడ్యూల్ ప్రకారం ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించిన వారికి ఇప్పటికే ట్యాక్స్ రీఫండ్ కూడా వచ్చేసింది. అయితే చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇంకా ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక చిన్న లోపం కూడా పన్ను వాపసు స్వీకరించే ప్రక్రియకు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున, జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఒకవేళ ఐటీఆర్ ఫైలింగ్‌ను పూర్తి చేసినా.. ఇంకా ధృవీకరించనట్లయితే ఈ తప్పులు కారణం కావొచ్చు.
==> దాఖలు చేసినా కానీ ధృవీకరించని ఐటీఆర్ చెల్లనిదిగా పరిగణిస్తారు
==> మీ ఐటీఆర్ ధృవీకరించకపోతే.. ప్రాసెసింగ్ కోసం ఐటీఆర్ తీసుకోదు.
==> అలాగే ఇప్పటికే మీరు పన్ను వాపసును క్లెయిమ్ చేసినట్లయితే.. అది మీ ఖాతాలో జమ అవ్వదు. ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి మీ ఐటీఆర్ "ప్రాసెసింగ్ కన్ఫర్మేషన్" పొందిందని మీరు ధృవీకరించినట్లయితేనే ట్యాక్స్ రీఫండ్ అవుతుంది
మీ ఐటీఆర్‌ను ఈ-వెరిఫై చేయడానికి ఇలా చేయండి
==> డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (డీఎస్‌సీ)ని ఉపయోగించి ఈ-వెరిఫై
==> ఆధార్ ఓటీపీని రూపొందించిన తర్వాత ఈ-వెరిఫై చేయండి
==> ఇప్పటికే ఉన్న ఆధార్ ఓటీపీని ఉపయోగించి ఈ-వెరిఫై చేయండి
==> ఇప్పటికే ఉన్న ఎలక్ట్రానిక్ ధృవీకరణ కోడ్ (EVC)ని ఉపయోగించి ఈ-వెరిఫై
==> బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎలక్ట్రానిక్ ధృవీకరణ కోడ్ (EVC)ని రూపొందించిన తర్వాత ఈ-వెరిఫై చేయండి.
==> డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఎలక్ట్రానిక్ ధృవీకరణ కోడ్ (EVC)ని రూపొందించిన తర్వాత ఈ వెరిఫై.
Also Read: Samantha Ruth Prabhu: ఛాన్స్ వస్తే ఒంటరిగా బతికేయండి.. సమంత పోస్ట్ అర్థం అదేనా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి