Jio 5G Test Details: దేశంలో ఇంటర్నెట్ రంగంలో పెనుమార్పులు రానున్నాయి. 5 జీ ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ టెలీకాం కంపెనీ జియో 5జి టెస్ట్‌లో దూసుకుపోతోంది. ఆ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశంలో 5జి నెట్‌వర్క్ త్వరలో అందుబాటులో వచ్చేందుకు రంగం సిద్ధమౌతోంది. ఇప్పటికే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలు టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా 5 జి నెట్‌వర్క్ రంగంలో దూసుకుపోయేందుకు జియో సంస్థ అన్ని విధాలా సిద్ధమౌతోంది. 2022 చివరినాటికి ఇండియాలో 5జి నెట్‌వర్క్ అందుబాటులో రావచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. దేశంలోని 13 మెట్రో నగరాల్లో ప్రాధమిక దశలో 5 జి నెట్‌వర్క్ ప్రారంభించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రకటించింది. 


దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ విషయంలో జియో 5జి ( Jio 5G ) రేసులో ముందుండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే 5జి నెట్‌వర్క్ అందుబాటులో రాగానే..కస్టమర్లకు సౌలభ్యం కోసం వేయి నగరాల్లో 5జి సేవలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది జియో. ఇప్పటికే జియో 5జి ట్రయల్ (Jio 5G Test) రన్ నిర్వహించింది. అధికారికంగా ఆ టెస్ట్ వివరాలు ప్రకటించకపోయినా..సమాచారం మాత్రం లీకైంది. జియో 5జి టెస్ట్‌లో స్పీడ్ 4 జి కంటే 8 రెట్లు అత్యధికంగా ఉన్నట్టు తెలిసింది. 420 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తోనూ, 412 అప్‌లోడ్ స్పీడ్‌తోనూ జియో 5జి నెట్‌వర్క్ ఉన్నట్టు టెస్ట్ ఫలితాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న 4 జి కంటే ఇది ఏకంగా 15 రెట్లు అధికం. జియో 4 జి స్పీడ్ ఇప్పుడు డౌన్‌లోడ్ అయితే 46.82 ఎంబీపీఎస్, అప్‌లోడ్ అయితే 25.31 ఎంబీపీఎస్‌గా ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇంతటి స్పీడ్‌తో  రెండు గంటల సినిమాను కేవలం ఒక్క నిమిషంలోనే డౌన్‌లోడ్ చేసేయవచ్చు.


ఇప్పటికే ముంబై నగరంలో జియో 5 జి నెట్‌వర్క్ పరీక్షలు (Jio 5G Test Details Leaked) పూర్తయ్యాయి. జియో 5 జి నెట్‌వర్క్ స్పీడ్ డౌన్‌లోడ్‌లో 8 రెట్లు, అప్‌లోడ్‌లో 15 రెట్లు ఎక్కువగా ఉంది. త్వరలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, గురుగ్రామ్, చండీగఢ్, బెంగళూరు, అహ్మదాబాద్, జామ్ నగర్, హైదరాబాద్, పూణే, లక్నో, గాంధీనగర్ వంటి ఎంపిక చేసిన నగరాల్లో  5 జి నెట్‌వర్క్  ప్రాధమికంగా విడుదల కానుంది. 


Also read; Todays Gold Price: దిగివస్తున్న బంగారం ధర, దేశంలో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook