Jio 5G Service to Launch in India:  రిలయన్స్ జియో 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక ప్రకటన వచ్చింది. కానీ జియో వినియోగదారులకు నిరాశే ఎదురైంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 సమావేశంలో మంగళవారం మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.


Also Read: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


డిజిటల్ పరంగా అత్యుత్తమ కనెక్టివిటీ ఉన్న దేశాలలో భారత్ ఒకటి అని ముఖేష్ అంబానీ (Mukesh Ambani) పేర్కొన్నారు. 5జీ సేవల్ని త్వరగా అందించేందుకు విధాన పరమైన నిర్ణయాలను సంస్థ త్వరలోనే తీసుకోనుందన్నారు. అయితే దేశ వ్యాప్తంగా టెలికాం సంస్థలు సైతం ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. గూగుల్ (Google) సంస్థతో కలిసి ఓ ఆడ్రాయిడ్ మొబైల్‌ను రిలయన్స్ కొన్ని రోజుల్లో మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని ధర రూ.4000 ఉండనుందని అంచనా వేస్తున్నారు.


Also Read: SBI Credit Card Offers: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ.25000 గెలుచుకోండి.. ఏం చేయాలంటే!


 


కాగా, వచ్చే ఏడాది రిలయన్స్‌ తీసుకొచ్చే 5జీ నెట్‌వర్క్‌ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేయనున్నారు. 2జీ సేవలు వినియోగిస్తున్న వారికి సైతం ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రతీకగా తమ జియో కంపెనీ 5జీ నిలవనుందని అభిప్రాయపడ్డారు. 


Also Read : Singer Sunitha Engagement Photos: సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ గ్యాలరీ 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook