Jio users down: జియోకు షాకిచ్చిన యూజర్లు.. భారీగా పడిపోయిన యూజర్ల సంఖ్య!
Jio users down: టెలికాం యూజర్ల సంఖ్య 2021 డిసెంబర్లో భారీగా పడిపోయింది. రిలయన్స్, వొడాఫోన్ ఐడియా యూజర్లను భారీగా కోల్పోవడం ఇందుకు కారణంగా ట్రాయ్ డేటాలో వెల్లడైంది.
Jio users down: గత ఏడాది చివరి నెలలో దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్ల సంఖ్య భారీగా తగ్గింది. 2021 డిసెంబర్లో టెలికాం యూజర్ల సంఖ్య అంతకు ముందు నెల(నవంబర్)తో పోలిస్తే 1.28 కోట్లు తగ్గినట్లు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఇటీవల విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా అత్యధిక యూజర్లను కోల్పోగా.. ఎయిర్టెల్ స్వల్పంగా కొత్త యూజర్లను సాధించినట్లు తాజాగ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం వైర్లెస్ నెట్వర్క్ యూజర్ల సంఖ్య 115.46 కోట్లకు తగ్గిందని పేర్కొంది ట్రాయ్. 2021 నవంబర్‌లో మొత్తం వైర్లెస్ టెలికాం యూజర్ల సంఖ్య 116.74 కోట్లుగా ఉండటం గమనార్హం.
జియోకు తగ్గిన యూజర్లు..
2021 డిసెంబర్లో రిలయన్స్ జియో 1.29 కోట్ల యూజర్లను కోల్పోయినట్లు ట్రాయ్ డేటాలో తేలింది. దీనితో జియో యూజర్ల సంఖ్య 41.57 కోట్లకు తగ్గింది. అయినప్పటికీ దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్ జియోనే ఉండటం గమనార్హం.
వొడాఫోన్ ఐడియాది అదే బాట..
2021 డిసెంబర్లో 16.14 లక్షల మంది వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌ను వీడారు. దీనితో డిసెంబర్ నాటికి వొడాఫోన్ ఐడియా మొత్తం వినియోగదారుల సంఖ్య 26.55 కోట్లకు దిగొచ్చిందని ట్రాయ్ వివరించింది.
స్వల్పంగా పెరిగిన ఎయిర్టెల్ యూజర్లు..
ఇక దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్టెల్ 2021 డిసెంబర్లో 4.75 లక్షల మంది కొత్త యూజర్లను రాబట్టింది. దీనితో ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 35.57 కోట్లకు పెరిగింది.
మార్కెట్ షేర్ పరంగా చూస్తే.. 2021 డిసెంబర్ చివరి నాటికి ఎయిర్టెల్ మార్కెట్ వాటా 30.43 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా 23 శాతానికి చేరింది. ఇక జియో మార్కెట్ వాటా కాస్త తగ్గినప్పటికీ.. 36 శాతంతో మార్కెట్ లీడర్‌గా ఉండటం గమనార్హం.
బ్రాడ్ బ్యాండ్ యూజర్లలోనూ క్షీణత..
మరోవైపు దేశవ్యాప్తంగా బ్రాండ్ బ్యాండ్ వినియోగదారుల్లోనూ క్షీణత నమోదైందని ట్రాయ్ పేర్కొంది. ముఖ్యంగా 2021 డిసెంబర్లో మొత్తం బ్రాడ్ బ్యాండ్ యూజర్ల సంఖ్య 79.2 కోట్లకు తగ్గిందని తెలిపింది. 2021 నవంబర్‌లో ఈ సంఖ్య 80.1 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది ట్రాయ్.
ఇక మొత్తం బ్రాడ్ బ్యాండ్ మార్కెట్లో టాప్ 5లో ఉన్న కంపెనీలే 98.54 శాతం వాటాను కలిగి ఉన్నట్లు ట్రాయ్ వివరించింది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 42 కోట్ల యూజర్లను, భారతీ ఎయిర్టెల్ 21 కోట్ల యూజర్లను, వొడాఫోన్ ఐడియా 12.2 కోట్ల యూజర్లను, బీఎస్ఎన్ఎల్ 2.5 కోట్ల యూజర్లను కలిగి ఉన్నాయని ట్రాయ్ డేటాలో తేలింది.
Also read: iPhone 12: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్- పూర్తి వివరాలివే..
Also read: Meta Facebook Services: ఇండియాలో ఎక్స్‌ప్రెస్ సేవల్ని నిలిపివేసిన ఫేస్‌బుక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook