iPhone 12: ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లో ఐఫోన్​ 12పై భారీ డిస్కౌంట్​- పూర్తి వివరాలివే..

iPhone 12: iPhone 12 Price: ఐఫోన్​ 12పై ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లు అదిరే డిస్కౌంట్ ఇస్తున్నాయి. రెండింటిలో ఆఫర్లు ఎలా ఉన్నాయి? దేనిలో అత్యంత తక్కువ ధరకు ఫోన్​ను కొనొచ్చు అనే వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2022, 12:11 PM IST
  • ఐఫోన్​ కొనానుకునే వారికి గుడ్​ న్యూస్​
  • భారీ డిస్కౌంట్​తో ఫ్లిప్​కార్ట్​లో సేల్​
  • అమెజాన్​లోను అదిరే ఆఫర్​
iPhone 12: ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లో ఐఫోన్​ 12పై భారీ డిస్కౌంట్​- పూర్తి వివరాలివే..

iPhone 12: ఐఫోన్ కొనాలనుకుని ఎదురు చూస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్​. ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లు ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మరి ఏ సైట్లో తక్కువ ధరకు ఐఫోన్​ 12ను కొనుగోలు చేయొచ్చు? బ్యాక్​ ఆఫర్లు, ఇతత తగ్గింపులు ఏమైనా ఉన్నాయా? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఫ్లిప్​కార్ట్ ఆఫర్లు ఇలా..

ఐఫోన్​ 12 (128 జీబీ స్టోరేజ్​) మార్కెట్​ (ప్లిప్​కార్ట్​ ప్రకారం) రూ.70,900గా ఉంది. ఫ్లిప్​కార్ట్​ ఈ ఫోన్​పై 8 శాతం తగ్గింపు ఇస్తోంది. అంటే ఈ ఫోన్​ ధర ప్రస్తుతం రూ.64,999 వద్దకు తగ్గింది.

ఫ్లిప్​కార్ట్ యాక్సిస్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డు ద్వారా ఈ ఫోన్​ను కొనుగోలు చేస్తే.. 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అంటే ఫోన్​ ధర దాదాపు రూ.3250 తగ్గుతుంది.

అప్పుడు ఫోన్ ధర రూ.61,749 వద్దకు చేరుతుంది.

ఇక ఈ ఫోన్​పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. ఎక్స్ఛేంజ్​ చేసే ఫోన్​ కంటీషన్​ను బట్టి.. రూ.15,500 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు ఫ్లిప్​కార్ట్​ యాప్​, వెబ్​సైట్​ ద్వారా తెలిసింది.

ఒక వేళ ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్​కు ఎక్స్ఛేంజ్ విలువ రూ.15,500 వస్తే.. ఐఫోన్​ 12 ధర రూ.46,249 తగ్గుతుంది.

అంటే అన్ని ఆఫర్లు కలుపుకుని ఫ్లిప్​కార్ట్​లో రూ.70,900గా ఉన్న ఐఫోన్​ 12ను రూ.46,249కి పొందొచ్చు.

అమెజాన్​లో ఇలా..

అమెజాన్​లో సైతం ఐఫోన్​ 12 (128 జీబీ) పై భారీ తగ్గింపు ఇస్తోంది.

అమెజాన్​లో ఐఫోన్ 12 అసలు ధర రూ.84,900గా ఉంది. అయితే 28 శాతం డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్. దీనితో రూ.23,901 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్​తో ఫోన్​ ధర రూ.60,999గా ఉంది.

దీనితో పాటు.. బ్యాంక్​, ఆఫర్​ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తోంది అమెజాన్​.

ఫోన్​ కండీషన్​ను బట్టి రూ.15,050 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్​ పూర్తిగా లభిస్తే జాక్​పాట్​ కొట్టినట్లే. ఎందుకంటే ఫోన్​ ధర అప్పుడు రూ.45,949కు తగ్గుతుంది.

ఐఫోన్​ 12 ఫీచర్లు..

  • 6.1 అంగుళాల డిస్​ప్లే
  • ఏ14 బయోనిక్​ చిప్​సెట్​
  • వెనుకవైపు రెండు కెమెరాలు 12 ఎంపీ+ఎంపీ
  • 12 ఎంపీ సెల్ఫీ కెమెరా

Also read: Instagram Money: ఇంట్లో కూర్చొని ఇన్ స్టాగ్రామ్ నుంచి రూ.లక్షలు సంపాదించవచ్చు!

Also read: EPFO Interest Rate: ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై ఖాతాదారులకు గుడ్ న్యూస్ రానుందా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News