డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో అగ్రస్థానం- అప్‌లోడ్‌లో వొడాఫోన్ ఐడియా జోరు!
Reliance Jio: టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) అక్టోబర్‌కు సంబంధించి.. 4జీ నెట్వర్క్ డౌన్‌లోడ్, అప్లోడ్ స్పీడ్ గణాంకాలను విడుదల చేసింది. డౌన్‌లోడ్ పరంగా జియో మరోసారి అగ్రస్థానాన్ని సాధించినట్లు తెలిపింది.
Reliance Jio top in highest average data download speed: డౌన్‌లోడ్ పరంగా అత్యంత వేగవంతమైన 4జీ డేటాను అందించే టెలికాం కంపెనీగా మరోసారి రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబర్ నెలకు గానూ టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వెల్లడించిన (TRAI report on 4G Data speed) గణాంకాల ప్రకారం ఈ విషయం వెల్లడైంది.
అక్టోబర్‌లో జియో సగటున 21.9 ఎంబీపీఎస్ వేగంతో (Jio 4G download speed) ఇంటర్నెట్ అందించినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ ఏడాది జూన్ తర్వాత మళ్లీ అక్టోబర్‌లోనే డేటా స్పీడ్ 21.9 స్థాయికి చేరినట్లు వెల్లడించింది ట్రాయ్.
ఇతర టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (వి)లు కూడా డేటా స్పీడ్‌ను క్రమంగా పెంచుతూ వస్తుండటంతో.. జియోతో పోటీ పెరుగుతున్నట్లు వివరించింది ట్రాయ్.
Also read: OnePlus Nord 2 Pac-Man smartphone: వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర
అక్టోబర్‌లో ఎయిర్టెల్ 4జీ మొబైల్ నెట్వర్క్ డౌన్‌లోడ్ స్పీడ్ 13.2 ఎంబీపీఎస్‌గా (Airtel 4G download speed) తెలిపింది టెలికాం నియంత్రణ సంస్థ. జూన్‌లో ఇది 5 ఎంబీపీఎస్‌గా ఉన్నట్లు వివరించింది.
ఇక వొడాఫోన్ ఐడియా 4జీ మొబైల్ నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ అక్టోబర్‌లో 15.6 ఎంబీపీఎస్‌గా నమోదైనట్లు (Vodafone Idea 4G download speed) తెలిపింది ట్రాయ్. జూన్‌లో ఇది 6.5 ఎంబీపీఎస్‌గా ఉన్నట్లు వివరించింది.
Also read: వరుసగా రెండవరోజు పెరిగిన బంగారం ధర, దేశవ్యాప్తంగా ఏ నగరంలో ఎంత ధర
Also read: యమహా నుంచి మార్కెట్లోకి మరో కొత్త బైక్.. ధర ఎంతో తెలుసా ?
అప్‌లోడ్‌లో వొడాఫోన్ ఐడియాదే అగ్రస్థానం..
అప్లోడ్ పరంగా అత్యంత వేగవంతమైన 4జీ డేటాను అందించే టెలికాం సంస్థగా వొడాఫోన్ ఐడియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అక్టోబర్‌లో వొడాఫోన్ ఐడియా సగటున 7.6 ఎంబీపీఎస్ అప్లోడ్ (Vodafone Idea 4G Upload speed) స్పీడ్‌తో ఇంటర్నెట్ అందించినట్లు ట్రాయ్ పేర్కొంది.
ఇతర టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ట్రాయ్ ప్రకారం అక్టోబర్‌లో ఎయిర్టెల్ 4జీ అప్లోడ్ స్పీడ్ 5.2 ఎంబీపీఎస్‌గా (Airtel 4G Upload speed) నమోదైంది. రిలయన్స్ జియో 4జీ డేటా అప్లోడ్ స్పీడ్ 6.4 శాతంగా (Jio 4G Upload speed) నమోదైంది.
మైస్పీడ్ అప్లికేషన్ సహయంతో.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సేకరించిన ఫలితాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు ట్రాయ్ పేర్కొంది.
Alao read: రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా బడ్జెట్ ఎయిర్‌లైన్ 'ఆకాశ' రెండు భారీ డీల్స్!
Also read: 2021-22 క్యూ4లో ఎల్ఐసీ ఐపీఓ- వివిధ పీఎస్‌యూల ప్రైవేటీకరణ కూడా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook