Jio TV Plus App: ఇంటిల్లిపాదికి వినోదం అందించే జియో టీవీ ప్లస్‌ మరో అద్భుత ఆఫర్‌ ప్రకటించింది. ఒకే ఒక కనెక్షన్‌తో రెండు టీవీలను చూసే అవకాశాన్ని కల్పించింది. అంతేకాకుండా 800కు పైగా ఛానెళ్లు, 13 ఓటీటీ యాప్‌లను వీక్షించవచ్చు. టూ ఇన్‌ వన్‌ ఆఫర్‌ పేరిట జియో టీవీ ప్రకటించిన ఆఫర్‌ అందరినీ ఆకర్షిస్తోంది. జియో టీవీ అందిస్తున్న ఈ నూతన ఆఫర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్.. ఐదు నెలల వ్యాలిడిటీ అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్..


 


రిలయన్స్ జియో సరికొత్తగా "జియో టీవీ ప్లస్ టూ-ఇన్-వన్" ఆఫర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ వినూత్న ఆఫర్‌ను పొందితే వినియోగదారులు ఒకే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌ని ఉపయోగించి ఒకేసారి రెండు టెలివిజన్‌లను చూసుకునే అవకాశం ఉంది. ఈ ప్లాన్‌తో జియో టీవీ ప్లస్ యాప్ ద్వారా సబ్‌స్క్రైబర్‌లు, 800కి పైగా డిజిటల్ టీవీ ఛానెల్స్, 13 ప్రముఖ ఓటీటీ యాప్‌లను చూడవచ్చు.

Also Read: Jio Best Recharge plans: జియో కస్టమర్లకు గ్రేట్ న్యూస్ ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జీ5, హాట్‌స్టార్ ఉచితం


 


జియో టీవీ ప్లస్‌ యాప్ అనేక రకాల కంటెంట్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. 10 భాషలు, 20 కేటగిరీల్లో 800 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లను అందిస్తోంది. ఈ విస్తృతమైన ఛానెల్ లైనప్‌తో పాటు, వినియోగదారులు ఒకే లాగిన్ నుంచి 13కి పైగా ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లకు పూర్తి యాక్సెస్‌ పొందవచ్చు.


జియో టీవీ ప్లస్‌ ముఖ్య ఫీచర్లు ఇవే..
- ఒకే సైన్-ఆన్: అనేక ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు సులభతరం చేస్తుంది.
- స్మార్ట్ టీవీ రిమోట్: నావిగేషన్, నియంత్రణ సౌలభ్యం నిర్ధారిస్తుంది.
- వ్యక్తిగత కంటెంట్: మీరు వీక్షించిన కంటెంట్‌ ఆధారంగా టైలర్స్ సిఫార్సులు
- స్మార్ట్ ఫిల్టర్‌లు: సులభంగా కంటెంట్‌ను శోధించవచ్చు. ఛానెల్‌ల ఆవిష్కరణను సులభతరం చేస్తుంది.
- ప్లేబ్యాక్ నియంత్రణ: ప్లేబ్యాక్ వేగాన్ని సర్దుబాటు చేయడానికి.. గతంలో ప్రసారమైన షోలను చూడటానికి వినియోగదారులను అనుమతి వస్తుంది.


ఈ సేవ అన్ని జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌లతో అందుబాటులో ఉంది. జియో ఫైబర్‌ పోస్ట్ ‌పెయిడ్ కస్టమర్‌ల కోసం ఇది రూ.599, రూ.899, అంతకంటే ఎక్కువ ప్లాన్‌లలో చేర్చారు. జియో ఫైబర్‌ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఈ సేవ రూ.999, అంతకంటే ఎక్కువ ప్లాన్‌లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. జియో టీవీ ప్లస్‌ యాప్ ద్వారా అందించే అనేక ఛానెల్‌లు, ఓటీటీ యాప్‌లలో కలర్స్ టీవీ, స్టార్ ప్లస్, జీ టీవీ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. వీటికి అదనంగా డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌, సోనీ లివ్‌, జీ 5 వంటి అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కూడా చేర్చబడ్డాయి.


ఆఫర్‌ పొందాలంటే..?


  • ఈ  ఆఫర్‌ పొందాలంటే.. మీ స్మార్ట్ టీవీ యాప్ స్టోర్ నుంచి జియో టీవీ ప్లస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసువాలి.

  • మీ రిజిస్టర్డ్ జియో ఫైబర్‌, జియో ఎయిర్‌ ఫైబర్‌ ఫోన్‌ నంబర్‌తో లాగిన్ చేయండి. 

  • అనంతరం కంటెంట్ లైబ్రరీని ఆస్వాదించండి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook