JioPhone Next Price: రిలయన్స్ జియో గతేడాది 'జియోఫోన్ నెక్స్ట్‌ 4జీ' స్మార్ట్ ఫోన్‌ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.5 వేల లోపే ఉండొచ్చునని చాలామంది భావించారు. కానీ రిలయన్స్ దీని ధరను రూ.6499గా ఫిక్స్ చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈఎంఐ పద్దతిలో అయితే ఇదే స్మార్ట్ ఫోన్‌కి రూ.8 వేల కన్నా ఎక్కువ చెల్లించాల్సిందే. కస్టమర్లకు ఇది తీవ్ర నిరాశ కలిగించింది. ప్రస్తుతం ఇదే స్మార్ట్‌ ఫోన్ భారీ తగ్గింపుతో అమెజాన్‌లో అందుబాటులో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెజాన్‌లో భారీ తగ్గింపు :


రూ.6499 విలువ చేసే జియో నెక్స్ట్ 4జీ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.4599కే అందుబాటులో ఉంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో మరింత చౌకగా రూ.4499కే ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తోంది. ఇందుకోసం మీ పాత మొబైల్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈఎంఐ పద్దతిలో అయితే నెలకు కేవలం రూ.216 చెల్లించి ఈ స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.


జియో ఫోన్ ఫీచర్స్ :


ప్రస్తుతం మార్కెట్లో ఇంత కన్నా తక్కువ ధరలో 4జీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేవు. కాబట్టి అతి చౌక ధరలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ డీల్. మొదట్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు ఆసక్తి చూపారు. రాను, రాను పట్టణ ప్రాంత ప్రజలు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ప్రతికూల అంశమేంటంటే.. కేవలం జియో సిమ్‌తో మాత్రమే ఈ ఫోన్‌ని ఆపరేట్ చేయవచ్చు. వేరే టెలికాం నెట్‌వర్క్స్‌కి చెందిన సిమ్ కార్డును ఇందులో ఇన్‌సర్ట్ చేయలేరు. ఇందులో 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సెల్, బ్యాక్ కెమెరా 13 మెగా పిక్సెల్, బ్యాటరీ 3500 mAh సామర్థ్యంతో ఉంటుంది.


Also Read: Java Plum Benefits: నేరేడు పండ్ల వల్ల చర్మానికి ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా..!


Also Read: TS DOST 2022: నేడే దోస్త్ నోటిఫికేషన్.. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోండిలా...  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి