TS DOST 2022 Notification: తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేడు దోస్త్ (DOST) నోటిఫికేషన్ విడుదల కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఆయా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందేందుకు దోస్త్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉస్మానియా, కాకతీయ,శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీల పరిధిలోని 1060 కాలేజీల్లో దాదాపు 4,25,000 సీట్లను భర్తీ చేయనున్నారు.మూడు లేదా నాలుగు విడతల్లో విద్యార్థులకు సీట్ అలాట్‌మెంట్ ప్రక్రియ ఉంటుంది. విద్యార్థులు ఇచ్చే వెబ్ ఆప్షన్ల ఆధారంగా భర్తీ ప్రక్రియ జరుగుతుంది.
ఇలా రిజిస్టర్ చేసుకోండి :
1) విద్యార్థులు మొదట https://dost.cgg.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
2) హోం పేజీలో క్యాండిడేట్ ప్రీరిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
3) రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్‌పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి
4) ఆ తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ సమర్పించాలి
ఇంటర్ ఫలితాలు మంగళవారం (జూన్ 28) విడుదలైన నేపథ్యంలో నేడు దోస్త్ నోటిఫికేషన్ విడుదలచేయనన్నారు. సప్లిమెంటరీ ద్వారా ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించేవారు తర్వాతి విడతల్లో దోస్త్ ద్వారా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇంటర్ ఫలితాల్లో బాలికల్లో పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67.96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్, సెకండియర్ రెండింటిలోనూ మేడ్చల్ జిల్లా టాప్‌లో నిలిచింది.
Also Read: Covid Cases: పెరుగుతున్న కొవిడ్ మరణాలు.. లక్షకు చేరువలో యాక్టివ్ కేసులు! దేశంలో కల్లోలం తప్పదా?
Also Read: Anti Modi Flexi: హైదరాబాద్ లో కలకలం.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి