Uber and Ola fixed Rates in Karnataka: నగరాల్లో కాస్త దూరం వెళ్లాలన్న టాక్సీ వాళ్లు భారీగా ఛార్జీలు వసూలు చేస్తూంటారు. ఇలా ఛార్జీలు వసూలు చేయడంపై సోషల్ మీడియాలో తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు నెటిజన్స్. ఈ నేపథ్యంలో కర్టాటక సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఊబర్​ వంటి యాప్​ ఆధారిత టాక్సీ సేవలకు కొత్త ఛార్జీల విధానాన్ని శనివారం ప్రకటించింది. దీని ప్రకారం, యాప్ ఆధారిత క్యాబ్ అగ్రిగేటర్‌లతో పాటు సిటీ టాక్సీల ఛార్జీలు ఒకే విధంగా ఉంటాయి. ఈ సవరించిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రద్దీ సమయాల్లో ఇష్టానుసారంగా పెంచేస్తున్న టాక్సీ రేట్లను కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఓలా, ఊబర్ వంటి ట్యాక్సీ సేవల సంస్థల స్వాగతించాయి. అయితే ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం మెుదటి నాలుగు కిలోమీటర్లకు అయ్యే ఖర్చు రూ.75.. కొత్త రూల్ ప్రకారం దానిని ప్రభుత్వం ఒకేసారి రూ.100కి పెంచేసింది. అంటే మెుదట్లోనే రూ.25 అదనంగా భారం పడుతుందన్న మాట. ఈ నిర్ణయంపై మధ్యతరగతికి చెందిన ట్యాక్సీ డ్రైవర్లు పెదవి విరుస్తున్నారు. లేట్​-నైట్​ రైడ్స్​పై వేసే అదనపు ఛార్జీలపైనా కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక నుంచి అర్ధరాత్రి 12- ఉదయం 6 గంటల మధ్యలో అదనంగా 10శాతం మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 


Also Read: Paytm: పేటీఎం చేయకండి.. వ్యాపారులకు CAIT కీలక సూచన..!


Also Read: FD Interest Rate Hike: ఈ ప్రభుత్వ బ్యాంకులు FDపై 8.40% వడ్డీ రేటును అందిస్తున్నాయి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter