FD Interest Rate Hike: ఈ ప్రభుత్వ బ్యాంకులు FDపై 8.40% వడ్డీ రేటును అందిస్తున్నాయి!

FD Interest Rate Hike: కొన్ని బ్యాంకులు వాటి పథకాల మెచూరిటీని పొడగించడంతోపాటు వాటి వడ్డీరేట్లను కూడా పెంచేశాయి. ఏయే బ్యాంకులు తమ బ్యాంకు ఎఫ్‌డీ రేట్లను పెంచాయో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Feb 4, 2024, 06:17 PM IST
FD Interest Rate Hike: ఈ ప్రభుత్వ బ్యాంకులు FDపై 8.40% వడ్డీ రేటును అందిస్తున్నాయి!

FD Interest Rate Hike: కొన్ని బ్యాంకులు వాటి పథకాల మెచూరిటీని పొడగించడంతోపాటు వాటి వడ్డీరేట్లను కూడా పెంచేశాయి. ఏయే బ్యాంకులు తమ బ్యాంకు ఎఫ్‌డీ రేట్లను పెంచాయో తెలుసుకుందాం.

జనవరిలో రెండుసార్లు తమ బ్యాంకు ఎఫ్‌డీపై వడ్డీరేటును పెంచింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. 300 రోజుల ఎఫ్‌డీపై 6.25 శాతం నుంచి 7.05 అంటే 80 బేసిక్ పాయింట్లు పెంచింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు 7.85 శాతానికి పెంచేసింది.

500 రోజుల వడ్డీ రేటును ఫెడరల్ బ్యాంక్‌ 7.75%, సీనియర్ సిటిజన్లకు 8.25%కి పెంచింది. ఫెడరల్ బ్యాంక్ సిటిజన్లకు గరిష్టంగా 8.40% రాబడిని అందిస్తోంది . కోటి నుంచి రూ.2 కోట్ల ఎఫ్‌డిలపై వడ్డీ రేటు 7.90%కి పెరిగింది. ఈ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుండి 10 ఏళ్ల వరకు 3% -7.75% మధ్య FD వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 8.25% వరకు వడ్డీ రేట్లు అందిస్తుంది.

ఇదీ చదవండి: Investment Plan: మీ జీతం రూ.20 వేలా? మీరు కోటీశ్వరులవ్వచ్చు.. ఎలానో తెలుసా?

IDBI బ్యాంక్ కూడా తమ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచేసింది. ఈ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు 3% -7% మధ్య FD వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇక సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 3.50% -7.50% వరకు వడ్డీని అందిస్తుంది. 

ఇదీ చదవండి: Paytm Payments Bank: ఒక పాన్‌కార్డ్‌పై 1000 ఖాతాలు... ఈ కారణాల వల్ల Paytm పై RBI ప్రత్యక్ష చర్య..

బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక FDని ప్రారంభించింది. ఈ కొత్త రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు వర్తిస్తాయి. 2024 జనవరి 15 నుండి అమలులోకి వస్తాయి. బ్యాంక్ సాధారణ పౌరులకు 7.10% FDని ప్రారంభించింది. ఇది సీనియర్ సిటిజన్లకు 7.60% వడ్డీ రేటును అందిస్తుంది. Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News