Kia Seltos Facelift: దేశంలో ఇటీవలి కాలంలో కియా కంపెనీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అద్భుతమైన ఫీచర్లు, లుక్స్ ఉండటంతో క్రేజ్ పెరుగుతోంది. ఇదే క్రమంలో కియా మోటార్స్ ఇప్పుడు తన సెల్టోస్ వెర్షన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేసింది. జూలై 14న అంటే నిన్న ప్రారంభమైన బుకింగ్స్‌లో ఊహించని స్పందన లభిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఎస్‌యూవీ కార్లలో సెల్టోస్ వెర్షన్‌కు అద్బుతమైన స్పందన ఉంది. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కొత్త వెర్షన్ లాంచ్ అయింది. జూలై 14 నుంచి బుకింగ్స్ ప్రారంభం కాగానే పెద్దఎత్తున స్పందన కన్పిస్తోంది. బుకింగ్స్ మొదటి రోజే రికార్డు సృష్టించింది కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్. కియా సెల్టోస్‌కు మొదటి రోజే 13,424 ప్రీ ఆర్డర్లు లభించాయి. ఇందులో 1973 కార్లను కోడ్ ద్వారా బుక్ చేసుకున్నారు. కోడ్ అనేది కియా ప్రస్తుత కస్టమర్లకుఓ ప్రత్యేక ఆఫర్ లాంటిది. మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో కియా సెల్టోస్ సంచలనం కల్గించనుందని కంపెనీ వెల్లడించింది. 


కియా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచింగ్‌లో లభించిన అద్భుతమైన స్పందన ముఖ్యంగా కే కోడ్ ఆఫర్ సక్సెస్ కావడంతో భవిష్యత్తులో కూడా ఈ తరహా క్యాంపెయినింగ్ కొనసాగిస్తామని కియా మోటార్స్ వెల్లడించింది. కియా ఫేస్‌లిఫ్ట్‌లో పాత మోడల్‌తో పోలిస్తే చాలా మార్పులు చేశారు. మోస్ట్ అడ్వాన్స్డ్, హైటెక్‌గా తీర్చిదిద్దారు. కొత్త కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్యానోరమిక్ సన్‌రూఫ్ మరో ప్రత్యేకత. 


ఇందులో మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లు 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ 115 బీహెచ్‌పి, 144 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ డీజల్ ఇంజన్ అయితే 115 బీహెచ్‌పి, 253 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇక 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే 160 బీహెచ్‌పి, 253 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్, 6 స్పీడ్ ఐఎంటీ, ఐవీటీ , 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి. అంతేకాకుండా కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో లెవెల్ 2 ఏడీఏఎస్ అందించారు. ఇందులో 17 ఫీచర్లు ఉన్నాయి. సెల్టోస్‌లో 15 సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్ విధానంలో ఉన్నాయి.


Also read: Mahila Samman Savings Scheme: మహిళలకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సూపర్ ఆఫర్‌.. అదేంటంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook