Mahila Samman Savings Scheme: మహిళలకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సూపర్ ఆఫర్‌.. అదేంటంటే..?

సాధారణంగా అయితే ఆషాఢమాసంలో మహిళలకు బట్టలు, నగలపై ఆఫర్సు వస్తుంటాయి. కానీ కొత్తగా బ్యాంకు ఆఫ్ బరోడా కొత్తగా మహిళల కోసం ఒక స్కీం తీసుకొచ్చింది. ఆ స్కీం వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2023, 02:20 PM IST
Mahila Samman Savings Scheme: మహిళలకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సూపర్ ఆఫర్‌.. అదేంటంటే..?

Mahila Samman Savings Scheme: ఆషాడంలో దాదాపు అన్ని షాపింగ్ మాల్స్ కూడా ఆడవారి కోసం ప్రత్యేకమైన ఆఫర్స్ ను ఇవ్వడం జరుగుతుంది. కానీ బ్యాంకింగ్ రంగంలో మాత్రం మహిళల కోసం ప్రత్యేకమైన ఆఫర్ లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వృద్దులకు.. వికలాంగులకు బ్యాంకింగ్‌ రంగంలో ఆఫర్లు ఉంటాయి కానీ మహిళలకు ప్రత్యేకమైన ఆఫర్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. 

ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటి అయిన బ్యాంక్ ఆఫ్‌ బరోడా మహిళల కోసం అతి పెద్ద ఆఫర్ ను ప్రకటించింది. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్ సర్టిఫికెట్‌ స్కీమ్‌ ను మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ స్కీమ్ ను కెనెరా బ్యాంక్‌.. బ్యాంక్ ఆఫ్ ఇండియా లు అందిస్తుండగా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా మహిళల కోసం ప్రత్యేకమైన ఆఫర్ గా దీనిని ప్రకటించింది. 

ఈ స్కిమ్‌ అనేది డిపాజిట్ స్కీమ్‌. రెండేళ్ల టెన్యూర్‌ తో ఈ స్కీమ్‌ పని చేస్తుంది. ఈ స్కీమ్‌ లో చేరితే 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 2025 వరకు మాత్రమే బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ స్కీమ్‌ ను కొనసాగించబోతున్నట్లుగా ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. 

ఈ లోపు మహిళలు స్కీమ్‌ ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా లాభం పొందవచ్చు, అధిక వడ్డీ రేటును ఇస్తున్న ఈ స్కీమ్‌ లో ఫిక్స్ డిపాజిట్ మొదలుకుని పలు రకాల పెట్టుబడులు పెట్టుకోవచ్చు. చిన్న పిల్లల పేరుపై కూడా ఈ పథకంలో చేరవచ్చు అంటూ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే వారి గార్డియన్‌ గా మాత్రం మహిళలే ఉండాల్సి ఉంటుందట. 

Also Read: Income Tax Refund Delayed: ఐటీ రీఫండ్‌కు మరింత సమయం.. అసలు కారణం ఇదే..!  

రెండు లక్షల వరకు డబ్బు దాచుకునే వెసులుబాటును ఈ స్కీము ద్వారా కల్పిస్తున్నారు. రెండు లక్షల రూపాయలను రెండేళ్ల టెన్యూర్ తో ఫిక్స్డ్‌ డిపాజిట్‌ చేసుకుంటే 7.5 శాతం వడ్డీ రేటు తో లభిస్తోంది. ఈ పథకం లో చిన్న మొత్తంలో డబ్బు దాచుకోవచ్చు. అయితే గరిష్టంగా డబ్బు సేవింగ్స్ చేసుకోవాలి అంటే మాత్రం రెగ్యులర్‌ వినియోగదారుల మాదిరిగానే సేవింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

మధ్య తరగతి వారికి ఇది బాగా పని చేస్తుంది. వారు రెండు లక్షల వరకు ఎక్కువ శాతం సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి 7.5 శాతం వడ్డీ రేటు లభించడం గొప్ప విషయం అన్నట్లుగా బ్యాంకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల వరకు డబ్బు భారీ మొత్తం లో పెరుగుతుంది కనుక మహిళలు ఈ సమ్మాన్‌ సేవింగ్స్ స్కీమ్ లో చేరితే పలు లాభాలు ఉంటాయి.

Also Read: 7th Pay Commission DA Hike: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంచుతూ నిర్ణయం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News