Car Safety Features: కారు అనేది ఓ నిత్యావసరంగా మారుతోంది. అందుకే కారు కొనుగోలు చేసేముందు కొన్ని కీలకమైన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. కారుకు సంబంధించిన కొన్ని ఫీచర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కారు కొనుగోలు చేసేముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. మీరు కొనాలనుకునేకారులో మరీ హైఫై ఫీచర్లు అవసరం లేదు. కానీ ముఖ్యమైన ఐదు ఫీచర్లుంటే చాలు. ఈ ఐదు ఫీచర్లుంటే చాలా వరకూ ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చు. ఇవి సేఫీ ఫీచర్లు. లగ్జరీ ఫీచర్లు లేకపోయినా సేఫ్టీ ఫీచర్లు ఉండేట్టు చూసుకుంటే చాలు. కారులో ముఖ్యంగా ఉండాల్సిన ఆ సేఫ్టీ ఫీచర్లు ఏంటనేది తెలుసుకుందాం.


1. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్..మీరు కొనుగోలు చేసే కారులో ఇది తప్పనిసరి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ సీటులో, పక్క సీటులో ఉండే వ్యక్తిని కాపాడేది ఇవే. అందుకే ఈ సేఫ్టీ ఫీచర్ తప్పకుంండా ఉండాలి. 2. ఇక రెండవది సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్. నిజం చెప్పాలంటే ఇదొక రక్షణ కవచం. సడెన్ బ్రేక్ వేసినప్పుడు సీట్లో ఉండే వ్యక్తిని కదలకుండా చేస్తుంది. 3. ఇక మూడవది స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్. చాలామంది ఈ ఫీచర్‌ను సింఫుల్‌గా తీసుకుంటారు కానీ చాలా అవసరం. కారు నిర్ధిష్టమైన వేగంలో ఉన్నప్పుడు కారు డోర్లు ఆటోమేటిక్‌గా లాక్ అవుతాయి. 


4. ఇక నాలుగవది ఏబీఎస్ ఈబీడీ. అంటే యాంటీ బ్రేకింక్ సిస్టమ్ విత్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. స్థూలంగా ABS-EBD అని పిలుస్తారు. కారు సడెన్ బ్రేక్ వేసినప్పుడు కారు చక్రాల్ని లాక్ కాకుండా చేసే వ్యవస్థ. కారు అదుపులో ఉండాలంటే ఇది అవసరం. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. దేశంలోని చాలాకార్లలో ఈ ఫీచర్ లేదు. 5. ఇక చివరిది రివర్స్ పార్కింగ్ సెన్సార్. అంటే ఎప్పుడైనా తక్కువ స్థలంలో పార్క్ చేస్తున్నప్పుడు దోహదపడుతుంది. కారు పార్క్ చేసేటప్పుడు ఏదైనా జరిగితే డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది.


Also read: అంతరిక్షంలోకి మనుషులు... మరో సంచలనానికి తెర లేపిన ఎలన్ మస్క్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe