Jio-Airtel-Vi Plans: మూడు దిగ్గజ కంపెనీల్లో నెలకు 479 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలివే
Jio-Airtel-Vi Plans: టెలీకం కంపెనీలు ప్రతిరోజూ కొత్త ప్లాన్స్ ప్రకటిస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఏయే ప్లాన్స్ ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాల ప్లాన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Jio-Airtel-Vi Plans: టెలీకం కంపెనీలు ప్రతిరోజూ కొత్త ప్లాన్స్ ప్రకటిస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఏయే ప్లాన్స్ ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాల ప్లాన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలోని మూడు ప్రముఖ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాల మధ్య ఎప్పటికప్పుడు పోటీ ఉంటుంది. యూజర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లు, ప్లాన్స్ ప్రకటిస్తుంటాయి. ఈ మూడు కంపెనీల మధ్య కామన్‌గా ఉన్న 479 రూపాయల ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్లాన్‌లో ఏ కంపెనీ ప్రీపెయిడ్ ప్లాన్ ఎక్కువ లాభదాయకంగా ఉందో చూద్దాం..
జియో 479 ప్లాన్
రిలయన్స్ జియో అందిస్తున్న నెలకు 479 రూపాయల ప్లాన్ ఇంది ఈ ప్రీ పెయిడ్ ప్లాన్ 56 రోజుల వ్యవధితో వస్తోంది. ఇందులో యూజర్లకు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం ఈ ప్లాన్‌లో 84 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా ఉచితంగా చూడవచ్చు.
ఎయిర్‌టెల్ 479 ప్లాన్
ఎయిర్‌టెల్ 479 ప్లాన్‌లో ప్రయోజనాలు ఇలా ఉన్నాయి. ఈ ప్లాన్‌లో యూజర్లకు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ పంపించుకోవచ్చు. 56 రోజుల వాలిడిటీ కలిగి ఉంది. ఈ ప్లాన్‌లో FASTagపై 100 రూపాయల క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. వింక్ మ్యూజిక్, హెల్లో ట్యూన్స్, అపోలో ఫ్రీ యాక్సిస్ ఉంటుంది.
వోడాఫోన్ ఐడియా 479 ప్లాన్
ఇక వోడాఫోన్ ఐడియా అందిస్తున్న 479 ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ప్లాన్ కూడా 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తాయి. ఈ ప్లాన్‌లో అదనంగా మరో ప్రయోజనముంది. రాత్రి 12 గంటల్నించి ఉదయం 6 గంటల వరకూ అన్‌లిమిటెడ్ ఫ్రీ ఇంటర్నెట్ ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్లాన్‌లో వీకెండ్ డేటా రోలోవర్ సౌకర్యముంది. ప్రతి నెలా 2 జీబీ డేటా బ్యాకప్ ప్రయోజనముంటుంది.
Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 40 వేలవరకూ పెరగనున్న జీతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి