Post Office Schemes: చాలామంది రిస్క్ లేని పెట్టుబడుల కోసం చూస్తుంటారు. అలాంటివారికి ఇదే మంచి అవకాశం. ఏ విధమైన రిస్క్ లేకుండా అద్భుతమైన లాభాలు ఆర్జించి పెట్టే టాప్ 5 డిపాజిట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకప్పుడు పోస్టాఫీసులు వేరు..ఇప్పుడు వేరు. ఇప్పుడు పోస్టాఫీసుల్లో ఎక్కువగా డిపాజిట్ స్కీమ్స్, సేవింగ్ ఎక్కౌంట్స్, బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. అంతకుమించి రిస్క్ లేని పెట్టుబడులు పెట్టే మార్గాలు కూడా ఇవే అందిస్తున్నాయి. అందుకే అంతటి ఆదరణ. పెట్టిన పెట్టుబడులపై మంచి ఆదాయం రావాలంటే పోస్ట్‌ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ మంచి మార్గం. పెట్టుబడులపై భద్రతతో పాటు మంచి రాబడి కూడా ఉంటుంది. పోస్టాఫీసు ఫథకాలు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. అటువంటి టాప్ 5 డిపాజిట్ స్కీమ్స్ వివరాల్ని పరిశీలిద్దాం.


సుకన్య సమృద్ధి పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌లు ప్రధానమైనవి. మొదటిది సుకన్య సమృద్ధి పథకం. ఈ పథకంలో సంరక్షకుడు పదేళ్ల కంటే తక్కువ వయస్సున్న ఆడపిల్ల పేరిట ప్రారంభించవచ్చు. ఒక ఆర్ధిక సంవత్సరంలో కనిష్టంగా 250 రూపాయలు, గరిష్టంగా 1 లక్ష 50 వేల రూపాయలవరకూ జమ చేయవచ్చు. ఏడాదికి 7.6 శాతం వార్షిక వడ్డీరేటు చొప్పున అందిస్తారు. 


రెండవది సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకం రిటైర్డ్ వ్యక్తులు, వృద్ధులకు ఉద్దేశించినది. మెచ్యూరిటీ ఐదేళ్లుంటుంది. ఈ స్కీమ్‌లో 7.4 శాతం వడ్డీ వస్తుంది. వేయి రూపాయల కనీస మొత్తంతో ప్రారంభించవచ్చు. గరిష్టంగా 15 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఒకేసారి పది లక్షల రూపాయలు స్కీమ్‌లో పెట్టుబడిగా పెడితే..ఐదేళ్లలో 14 లక్షల రూపాయలు వస్తాయి. వడ్డీరూపంలో 4 లక్షల 28 వేల 964 రూపాయలు పొందవచ్చు.


ఇక మూడవది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఇందులో ఎవరైనా ఖాతా తెరవవచ్చు. పీపీఎఫ్ కింద పెట్టుబడి పెట్టే నగదుపై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో కనీసం 5 వందల రూపాయలు, గరిష్టంగా 1 లక్ష 50 వేల రూపాయలు జమ చేయవచ్చు. పీపీఎఫ్‌లో డబ్బులు పెడితే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. పీపీఎఫ్ ఖాతాలో ఏడాదికి 1.5 లక్షలు పెట్టుబడి పెడితే..15 ఏళ్ల తరువాత 40 లక్షల రూపాయలు అందుతాయి. 


ఇక నాలుగవది కిసాన్ వికాస్ పత్ర. ఈ స్కీమ్‌లో కనీసం వేయి రూపాయలు పెట్టుబడిగా పెట్టవచ్చు. 124 నెలల్లో అంటే పది సంవత్సరాల 4 నెలల్లో పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఏడాదికి 7.7 శాతం వడ్డీ లెక్కిస్తారు. 50 వేల రూపాయలు డిపాజిట్ చేస్తే..మెచ్యూరిటీ కాలం తరువాత 73 వేల 126 రూపాయలు వస్తాయి. 


ఇక ఐదవది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్. మెచ్యూరిటీ ఐదేళ్లుంటుంది. కనీసం వేయి రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. వార్షిక వడ్డీ 6.8 శాతం ఉంటుంది. మెచ్యూరిటీ కాలం తరువాతే వడ్డీ లెక్కించి ఇస్తారు. ఎన్ఎస్‌సి స్కీమ్‌లో 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఐదేళ్ల తరువాత 21 లక్షలు వస్తాయి.


Also read: World Highest Rail Bridge: ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన రైల్వే బ్రడ్జి ప్రారంభం, ఎక్కడో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook