Kotak Mahindra Bank Hikes MCLR: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ తర్వాత ఇప్పుడు మరో బ్యాంక్ తన లోన్‌ల రేట్లను పెంచాలని నిర్ణయించింది. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ తన వినియోగదారులకు షాక్ ఇస్తూ.. రుణ రేట్లకు మార్జినల్ కాస్ట్ పెంచింది. బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేట్లు గురువారం నుంచి అమలులోకి వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఓవర్‌నైట్ లోన్ ఎంసీఎల్ఆర్ 8.25 శాతానికి పెరిగింది. ఒక నెలకు 8.50 శాతానికి, 3 నెలలకు 8.65 శాతానికి పెరిగింది. ఆరు నెలలకు 8.85 శాతానికి పెరిగింది. ఒకటి నుంచి మూడేళ్ల రుణాలకు 9.05 శాతం నుంచి 9.25 శాతం వరకు ఉంది. ఈ పెంపు తర్వాత హోమ్‌ లోన్, కారు లోన్, ఎడ్యుకేషన్ లోన్ మొదలైన రుణాలపై మరింత ఈఎంఐలు మరింత చెల్లించాల్సి ఉంటుంది. 


ఎస్‌బీఐ తన బేస్ రేటు, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్)ను బుధవారం నుంచి పెంచిన విషయం తెలిసిందే. త్రైమాసిక ప్రాతిపదికన బేస్ రేటు, బీపీఎల్ఆర్ పెంచాలని బ్యాంక్ నిర్ణయించింది. బ్యాంక్ తన బీపీఎల్‌ఆర్‌ను 70 బేసిస్ పాయింట్లు పెంచింది. గతంలో 14.15 శాతం ఉండగా.. తాజా పెంపుతో 14.85 శాతానికి చేరుకుంది. 


స్టేట్ బ్యాంక్ కంటే ముందే కెనరా బ్యాంక్ కూడా తన కస్టమర్లకు షాకిస్తూ.. ఎంసీఎల్ఆర్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్‌ను 45 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్‌ను 35 బేసిస్ పాయింట్లు పెంచడంతో 7.90 శాతానికి చేరుకుంది. అదేసమయంలో ఒక నెల ఎంసీఎల్ఆర్ 45 బేసిస్ పాయింట్లు పెరిగి 8 శాతానికి చేరుకుంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్‌లో 10 బేసిస్ పాయింట్ల పెరుగుదల తర్వాత.. 8.40 శాతానికి చేరుకుంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 25 బేసిస్ పాయింట్లు పెరిగి 8.15 శాతానికి, ఒక సంవత్సరం ఎంసీఎలర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.60 శాతానికి చేరుకుంది.


Also Read: Helicopter Crash: కూప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. పైలట్ల కోసం సెర్చ్ ఆపరేషన్  


Also Read: AP Budget 2023: రూ.2,79,279 కోట్లతో ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇలా..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి