Pan aadhaar: కొత్త ఆర్థిక సంవత్సరం అమలులోకి వచ్చింది. దీనితో ఆర్థికపరంగా అనేక మార్పులు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. అముదలో ముఖ్యమైంది.. పాన్-ఆధార్​ పాన్​ లింక్. మార్చి 31తో పాన్​ ఆధార్ అనుసంధానానికి గడువు ముగిసింది. అయినప్పటికీ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ).. పాన్​-ఆధార్ అనుసంధానం ఇంకా చేసుకోని వారికి కాస్త ఊరటనిచ్చింది. అవేమిటో ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాన్-ఆధార్ అనుసంధానానికి మార్చి 31తో గడువు ముగిసిన నేపథ్యంలో తాజాగా సీబీడీటీ ఓ ప్రకటన చేసిందగి. దీని ప్రకారం.. పాన్​-ఆధార్ అనుసంధానానం చేయకున్నా మరో సంవత్సరం పాటు అవి యాక్టివ్​లోనే ఉంటాయని స్పష్టం చేసింది. అంటే మార్చి 31 వరకు పాన్​ కార్డులు (ఆధార్​తో లింక్ కానివి) వినియోగించే వీలుంది. వాటితో ఐటీఆర్​ ఫైల్ చేయడం, రీఫండ్స్​ క్లెయిమ్​ సహా ఇతర ఆర్థిక అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఒక్కసారిగా పాన్​ కార్డులు నిరుపయోగంగా మారితే.. ఇబ్బందులు రావచ్చనే ఉద్దేశంతో సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.


ఇక పాన్​-ఆధార్ లింక్​కు జరిమానా..


ఇకపై పాన్-ఆధార్ లింక్ చేయాలంటే రూ.500 చెల్లించాలని సీబీడీటీ స్పష్టం చేసింది. అది కూడా జూన్ 30 వరకేనని తెలిపింది. జులై నుంచి ఈ ఫైన్​ రూ.1,000కి పెరుగుతుందని వెల్లడించింది. ఈ గడువు కూడా ముగిసిన తర్వాత ఆధార్​తో లింక్ చేయని పాన్​ కార్డులు నిరుపయోగంగా మారనున్నాయి.


పాన్ కార్డు ఇన్​యాక్టివ్​గా మారితే ఏమవుతుంది?


పాన్​ కార్డు నిరుపయోగంగా మారితే.. ఆర్థిక లావాదేవీలు జరిపే విషయంలో పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా మ్యూచువల్​ ఫండ్ల వంటి వాటిలో పెట్టుబడులు పెట్టలేరు. అధిక టీడీఎస్, ఐటీ చట్టంలోని సెక్షన్​ 272బీ ప్రకారం.. జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.


Also read: ATF Price hike: కొత్త రికార్డు స్థాయికి ఏటీఎఫ్​ ధర- పెరగనున్న విమాన టికెట్ల ధరలు?


Also read: LPG Gas Price Hike: భారీగా పెరిగిన LPG గ్యాస్ ధర.. సిలిండర్ పై రూ.250 పెంపు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook